CM KCR: ఎవరితోనైనా పెట్టుకోండి.. రైతులతో కాదు.. ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ కామెంట్స్..

కేంద్ర ప్రభుత్వంపై ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు. ఎవరితోనైనా పెట్టుకోండి.. రైతులతో కాదంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్. ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్..

CM KCR: ఎవరితోనైనా పెట్టుకోండి.. రైతులతో కాదు.. ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ కామెంట్స్..
Cm Kcr
Follow us

|

Updated on: Apr 11, 2022 | 1:22 PM

కేంద్ర ప్రభుత్వంపై ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు(CM KCR). ఎవరితోనైనా పెట్టుకోండి.. రైతులతో కాదంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్. ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులను జైలుకు పంపుతామని బెదిరిస్తారని.. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర ధాన్యం కొనుగోళ్ల విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామో వేచి చూడాలని, భూకంపం సృష్టిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ పార్టీకి చెందిన నేతలు ఏమి చేశారో కుండబద్ధలు కొడుతామని హెచ్చరించారు.

ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని.. ఇలా చేయడం పద్ధతి కాదని.. తాము ఇప్పటికే పోరాటం చేసేందుకు ముందుకు వచ్చామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చిన తర్వాత.. వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం తెలంగాణ భవన్ ప్రాంగంణంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టనుంది. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ విషయంలోనే ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పీయూష్ గోయల్ కాదు.. పీయూష్​ గోల్​మాల్ అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ రైతులను ఉద్దేశించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని పీయూష్‌ గోయల్ చెప్పారని.. అసలు తాము గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా అంటూ మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనాలని దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన తికాయత్‌కు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్‌.. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ దూరం వచ్చి దీక్ష చేస్తున్నామని వెల్లడించారు.

ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు అంటూ నిలదీశారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడవద్దన్న సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా హితవు పలికారు. దేశవ్యాప్తంగా ఎక్కడా లేనంతగా 30 లక్షల బోర్లు తెలంగాణలో ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు.

సీఎం కేసీఆర్ చేస్తున్నది రైతు ఉద్యమం..

కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేస్తోంది రాజకీయం కాదు.. రైతు ఉద్యమం అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (BKU) నేత రాకేశ్ టికాయత్ అన్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న సీఎం కేసీఆర్ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణకు కూడా వచ్చి పోరాటం చేస్తామని అన్నారు. దేశంలో రైతులు మరణిస్తూనే ఉన్నా కేంద్రం పటిష్ఠ చర్యలు తీసుకోకుండా కళ్లప్పగించి చూస్తోందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి: Jagan Cabinet 2.0: ఒక్కప్పుడు ఆ పార్టీలో.. ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలోకి.. కల్యాణదుర్గం ఎమ్మెల్యే..

Jagan Cabinet 2.0: మాటల మాంత్రికుడికి గుర్తింపు.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అంబటి..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!