Gujarat Blast: గుజరాత్ లో భారీ పేలుడు.. రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం
గుజరాత్(Gujarat) లోని బారుచ్ జిల్లాలో భారీ పేలుడు జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓమ్ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్దశబ్ధంతో బ్లాస్ట్(Blast) అయింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో...
గుజరాత్(Gujarat) లోని బారుచ్ జిల్లాలో భారీ పేలుడు జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓమ్ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్దశబ్ధంతో బ్లాస్ట్(Blast) అయింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్‌కు(Ahmedabad) 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహేజ్ ఇండస్ట్రియల్ పార్కులోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగింది. ఆ సమయంలో ఆరుగురు కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా పనిలో నిమగ్నమైన సమయంలో సాల్వెంట్ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. డెడ్‌బాడీస్‌ను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పేలుడుకు కారణమేంటి..? ఓమ్ ఆర్గానిక్ యాజమాన్యం నిర్లక్ష్యమేమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు,గతేడాది ఆగస్టులో కూడా ఇదే పారిశ్రామిక వాడలోని మరో రసాయన కంపెనీలో పెలుడు సంభవించింది. ఆ ఘటనలో ఓ కార్మికుడులు దర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు.
Also Read
UGC NET 2022: విద్యార్థులకి గమనిక.. జూన్‌లో UGC NET 2022 పరీక్ష
Paddy Dharna: ఢిల్లీ లో రైతు దీక్ష.. హాజరైన కేసీఆర్.. లైవ్ వీడియో