Iron Bridge: మూడు రోజుల్లో ఐరన్ బ్రిడ్జినే మాయం చేశారు.. ప్రభుత్వ అధికారి సహా 8 మంది కేటుగాళ్ల అరెస్ట్..

Iron Bridge Stealing: బీహార్‌లో 60 అడుగుల ఐరన్ బ్రిడ్జిని దుండగులు దొచుకున్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. రోహ్తాస్ జిల్లాలో ఇరిగేషన్ అధికారులమంటూ దొంగల ముఠా

Iron Bridge: మూడు రోజుల్లో ఐరన్ బ్రిడ్జినే మాయం చేశారు.. ప్రభుత్వ అధికారి సహా 8 మంది కేటుగాళ్ల అరెస్ట్..
Bihar
Follow us

|

Updated on: Apr 11, 2022 | 11:37 AM

Iron Bridge Stealing: బీహార్‌లో 60 అడుగుల ఐరన్ బ్రిడ్జిని దుండగులు దొచుకున్న ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. రోహ్తాస్ జిల్లాలో ఇరిగేషన్ అధికారులమంటూ దొంగల ముఠా.. మూడు రోజుల్లో శిథిలావస్థకు చేరిన ఇనుప వంతెనను మాయం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఇద్దరు ప్రభుత్వ అధికారులతో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిలో నీటిపారుదల శాఖ సబ్ డివిజనల్ అధికారి (SDO), వాతావరణ శాఖ అధికారి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు ఉన్నట్లు రోహ్తాస్ (Rohtas district) పోలీసులు తెలిపారు. వంతెనను దొంగతనం చేసేందుకు ఉపయోగించిన గ్యాస్ కట్టర్‌లతో పాటు జేసీబీ, పికప్ వ్యాన్‌, ఇనుప చానెళ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్‌పి ఆశిష్ భారతి వెల్లడించారు. తదుపరి విచారణ జరుపుతున్నామని.. ఈ కేసులో మరికొందరి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

రోహ్తాస్ జిల్లాలోని అమియావార్‌లో శిథిలావస్థకు చేరిన ఐరన్‌ బ్రిడ్జి ఉంది. దీనిని 1972 సంవత్సరంలో నిర్మించారు.. దాదాపు 500 టన్నుల బరువుంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. దీనిపై కన్నేసిన కొంత మంది పక్కా ప్రణాళికతో గ్రామానికి చేరుకున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన అధికారులమంటూ వంతెనను ముక్కలు ముక్కులుగా చేసి అక్కడినుంచి తరలించారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Bridge

Bridge

Health Tips: పులుపెక్కిన నిమ్మధరతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే ఆ లోటు పూడినట్లే

Also Read:  Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి..!