Hyderabad: మాదాపూర్ వడ్డెర బస్తీలో మరో మరణం నమోదు.. చికిత్స పొందుతూ 80ఏళ్ల వృద్ధురాలు మృతి
మాదాపూర్ బస్తీలో కలుషిత నీరు తాగి మరో మరణం చోటుచేసుకుంది. వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన చిన్నమ్మ అనే వృద్ధురాలు గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి...
మాదాపూర్ బస్తీలో కలుషిత నీరు తాగి మరో మరణం చోటుచేసుకుంది. వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన చిన్నమ్మ అనే వృద్ధురాలు గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. కలుషిత నీరు కారణంగానే అస్వస్థతకు గురై, చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజా లక్షణాలకు తోడు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో చిన్నమ్మ తీవ్ర అస్వస్థతతకు గురైంది. మొదట కొండాపూర్(Kondapur) ఏరియా ఆస్పత్రి తరలించగా మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ చిన్నమ్మ మృతి చెందింది. ఇది వరకే భీమయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కలుషిత నీరే అస్వస్థతకు కారణమని పేర్కొంటున్నారు. కాగా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితులకు సత్వర చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. నీరు, ఆహారం, వాయు కాలుష్యం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే.. ఇవే లక్షణాలతో రెండు రోజుల క్రితం భీమయ్య అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ మాదాపూర్‌లోని వడ్డెరబస్తీలో కలుషిత నీటి బాధితుల సంఖ్యతో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. కాలనీ వాసుల అస్వస్థతకు కలుషిత నీరు కారణం కాదని జలమండలి అధికారులు చెబుతున్నా.. ఇది నీటి వల్లే జరిగిందని కాలనీవాసులు అంటున్నారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. నీరు బాగా రావడం లేదని ప్రస్తుతానికి బయటినుంచే నీరు తెచ్చుకుని తాగుతున్నామని కాలనీవాసులు చెబుతున్నారు. మరోవైపు.. వైద్యారోగ్య శాఖ అధికారులు వడ్డెర బస్తీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
Also Read
AP New Cabinet: మంత్రి పదవి దక్కినందుకు విడదల రజనీ ఎమోషనల్.. సీఎం జగన్ గొప్ప నాయకుడంటూ..
పుచ్చకాయ గింజలను బయటపడేస్తున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
Crime news: సతీసహగమనానికి రివర్స్ సీన్.. భార్య చితిలో దూకిన భర్త.. అసలు కారణమేంటంటే