AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Political Special: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఎమ్మెల్యే.. ఆమెకే ఎందుకు మంత్రి పదవి?.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆ మహిళానేత ఎవరంటే..

AP Political Special: ఆంధప్రదేశ్ లోని ఆ జిల్లాలో 12మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు... అందులో సీనియర్ నాయకులు(Sr. Political leaders) ఉన్నారు.. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వారు ఉన్నారు..

AP Political Special: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఎమ్మెల్యే.. ఆమెకే ఎందుకు మంత్రి పదవి?.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆ మహిళానేత ఎవరంటే..
Minister Usha Sri
Surya Kala
|

Updated on: Apr 11, 2022 | 6:53 PM

Share

AP Political Special: ఆంధప్రదేశ్ లోని ఆ జిల్లాలో 12మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు… అందులో సీనియర్ నాయకులు(Sr. Political leaders) ఉన్నారు.. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వారు ఉన్నారు.. సీఎం జగన్(CM Jagan) కు సన్నిహితంగా ఉన్న వారు కూడా ఉన్నారు. కానీ ఆ మహిళా ఎమ్మెల్యేనే ఎందుకు క్యాబినెట్ లో తీసుకున్నారు. వివాదాలకు కేరాఫ్ గా ఉన్న ఆమెకే ఎందుకు మంత్రి పదవి ఇచ్చారు..? సామాజిక వర్గ ఈక్వేషన్సా.. లేక ఇతర కారణం ఏదైనా ఉందా…? అనుకోకుండా లక్కీ ఛాన్స్ కొట్టి మంత్రి అయిన ఆ మహిళా నేత  గురించి తెలుసుకుందాం..

ఉషా శ్రీ చరణ్.. ఈ పేరు మంత్రి వర్గంలో ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు మాత్రం దీనిని అస్సలు ఊహించలేదు. మొదటి నుంచి మంత్రి వర్గ రేస్ ఈ పేరు ఉన్నా.. గత రెండు రోజులుగా ఆమె రేస్ లో వెనుకబడ్డారని చెప్పాలి. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు మరోసారి అవకాశం ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే సాయంత్రం 5గంటల తరువాత అందరికీ ఊహించని షాక్ తగిలింది. రేస్ లో వెనుకబడ్డ ఉషా శ్రీ చరణ్ మంత్రి ఖరారైనట్టు సమాచారం. ఇది జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతలో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి మంత్రి పదవి అని చెప్పడంతో ఇది మరింత షాక్ కల్గించింది. ఎందుకంటే తిప్పేస్వామి దాదాపుగా రేస్ లో లేరు. మరోవైపు ఉష శ్రీ చరణ్ కు మంత్రి రాదనుకుంటున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం రావడం అందర్నీ విస్మయానికి గురి చేసింది….

ఇంతకీ ఎందుకు అందరికీ ఆశ్చర్యం కల్గించింది… అసలు మంత్రి కావడానికి దోహద పడిన అంశాలేంటంటే… వాస్తవంగా జిల్లాలో కురుబ సామాజిక వర్గం ఎక్కువ. అందుకే శంకర్ నారాయణకు తొలి క్యాబినేట్ లోనే అవకాశం దక్కింది. ఆయన తొలి సారి ఎమ్మెల్యే అయినా ఆయనకు మంత్రి పదవి వచ్చింది. మరోసారి కూడా ఆయన రేస్ లో ఉన్నారు. అదేంటి మహిళా కోటలో అదే సామాజిక వర్గానికి చెందిన ఉషా శ్రీ చరణ్ ఉన్నారని డౌట్ రావచ్చు. అందునా సీఎం జగన్ కు సన్నిహితులనే పేరు ఉంది. మరి ఆమె ఎందుకు రేస్ లో లేరంటే.. కళ్యాణదుర్గంలో సొంత పార్టీ నేతల నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మంత్రి పునర్వ్యస్థీకరణకు రెండు రోజుల ముందు కూడా ఒక అధికార పార్టీ కౌన్సిలర్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాదు మన్సిపల్ కార్యాలయం వేదికగా తన సోదరునిపై దాడి చేయించారని ఆరోపించారు. అంతముందు జడ్పీటీసీ, మున్సిపల్ ఛైర్మన్ ఇలా వరుస బెట్టి ఆమెపై దండయాత్ర చేశారు. ఇంత వ్యతిరేకత ఉన్న సమయంలో ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి రాదని జిల్లాలో ప్రచారం సాగింది…

కురుబ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణను కొనసాగిస్తున్నట్టు మొదట సమాచారం అందింది. కానీ రెండవ సారి మంత్రి వర్గంలోకి తీసుకునే వారి సంఖ్య ఎక్కువ కావడం.. క్యాబినేట్ నుంచి తొలగించిన వారిన అసంతృప్తిని పసిగట్టి చివరి నిమిషంలో వివాదాలు ఉన్నా.. ఉషాశ్రీ చరణ్ వైపు సీఎం జగన్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇది కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉషాశ్రీని బలపరిచే వర్గం కూడా బలంగా ఉంది. అందుకే ఆమెకు మంత్రి అనౌన్స్ కాగానే భారీగా సంబరాలు జరిగాయి. నియోజకవర్గంలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఉషాశ్రీకు ప్రధానంగా సామాజిక వర్గం కలిసి వచ్చిందనే టాక్ ఉంది. ఇక మంత్రిగా ఆమె కళ్యాణదుర్గంలో అడుగు పెట్టిన తరువాత రాజకీయాలు ఎలా ఉంటాయన్నది కాస్త ఆసక్తిగా చూస్తున్నారు…

మొత్తం మీద ఉషాశ్రీ చరణ్ కు మంత్రి పదవి రావడం ఒకింత ఆశ్చర్యాన్ని కల్గిస్తే.. ముగ్గరు నేతల్లో తీవ్ర అసంతృప్తి కనిపించింది. దాదాపు పేర్లు ఖారారైన టైంలో మార్పులు జరిగాయాని అనుచర వర్గం ఒకింత ఆగ్రహంగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా దీనిపై నిరసనలు మాత్రం కనిపించలేదు

Reporter: Kanth , Tv9 telugu

Also Read: Viral Video: ఒకదానితో ఒకటి పోటీ పడుతూ జిమ్నాస్టిక్స్‌ చేస్తోన్న కుక్కలు.. ఫన్నీ వీడియో వైరల్

Pawan Kalyan: అన్నదాతకు అండగా పవన్ కళ్యాణ్.. రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న జనసేనాని