Pawan Kalyan: అన్నదాతకు అండగా పవన్ కళ్యాణ్.. అనంతపురం జిల్లాలో పర్యటించనున్న జనసేనాని
Pawan Kalyan: కౌలు రైతుల భరోసా యాత్ర(Koulu Raitu Bharosa Yatra) ను రేపు ఏపీలోని (Andhra Pradesh) అనంతపురం జిల్లా నుంచి జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్..
Pawan Kalyan: కౌలు రైతుల భరోసా యాత్ర(Koulu Raitu Bharosa Yatra) ను రేపు ఏపీ(Andhra Pradesh)లోని అనంతపురం జిల్లా నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి.. వారి కుటుంబాల్లో దైర్యం నింపడానికి తలపెట్టిన ఈ యాత్రను అనంతపురం జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. రేపు (మంగళవారం) ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించి ఆర్ధిక సాయం అందించనున్నారు. అనంతరం కొత్త చెరువు నుంచి ధర్మవరానికి చేరుకొని మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించనున్నారు. 11:20 గం. కు ధర్మవరం నుంచి బయలుదేరి ధర్మవరం రూరల్ లోని గొట్లూరుకి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న మరో రైతు కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్ధిక సాయం అందించనున్నారు.
అనంతరం జనసేనాని అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వారి కుటుంబానికి అండగా నిలబడడానికి ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. జిల్లాలోని పర్యటనలో చివరిగా అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇక్కడ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఈ సభలో ఆర్ధిక సహాయం అందచేసి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు. గ్రామ సభ ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ ప్రయాణమవుతారు.
రేపు అనంతపురం జిల్లాలో శ్రీ @PawanKalyan గారి పర్యటన pic.twitter.com/LP6YwnSn9U
— JanaSena Party (@JanaSenaParty) April 11, 2022
Also Read :AP Cabinet Ministers: పదవ తరగతి నుంచి పీహెచ్‌డీ దాకా.. ఏపీ కొత్త మంత్రులు ఎవరెవరు ఏం చదివారంటే!