AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meat-eating: దేశంలో నాన్‌ వెజ్‌పై కొత్త వివాదం.. మాంసాహారం భారతీయుల ఆహారంలో భాగమేనా..?

Meat eating issue in India: దేశంలో ప్రస్తుతం మాంసాహారంపై వివాదం నెలకొంది. పవిత్రమైన శ్రీరామ నవమి, నవరాత్రి నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో మాంసం దుకాణాలను మూసివేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.

Meat-eating: దేశంలో నాన్‌ వెజ్‌పై కొత్త వివాదం.. మాంసాహారం భారతీయుల ఆహారంలో భాగమేనా..?
Food
TV9 Telugu Digital Desk
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Apr 12, 2022 | 12:40 PM

Share

Meat eating issue in India: దేశంలో ప్రస్తుతం మాంసాహారంపై వివాదం నెలకొంది. పవిత్రమైన శ్రీరామ నవమి, నవరాత్రి నేపధ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో మాంసం దుకాణాలను మూసివేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో మాంసాహారం విషయం కాస్త సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. JNUలో నాన్‌ వెజ్ వివాదంతో.. రెండు యూనియన్లకు చెందిన విద్యార్థులు ఘర్షణలకు దిగడంతో వివాదం మరింత ముదిరింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించిన తర్వాత భారతీయుల ఆహారపు అలవాట్ల విషయం మళ్లీ చర్చ మొదలైంది. ఈ వివాదంపై ప్రముఖ వ్యాసకర్త ఆకాష్ గులాంకర్ న్యూస్‌9 లైవ్‌కి రాసిన ప్రత్యేక వ్యాసంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భారతదేశంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య హిందువులలో కూడా బాగా పెరిగిపోయిందంటూ వ్యాసకర్త పేర్కొన్నారు. భారతదేశంలో పది మందిలో ఆరుగురు మాంసాహారం తింటున్నారని ప్యూ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిపోర్టులో వెల్లడించింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ అండ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) డేటా ప్రకారం.. సగం మంది భారతీయులు తమ ఆహారంలో మాంసాహారాన్ని ఆరగిస్తారు. అలాగే మాంసం తినే అలవాట్లు ఒక వ్యక్తి మతపరమైన నమ్మకం, విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని గమనించడం చాలా అవసరం.

మతం – మాంసపు అలవాట్లు

PEW డేటా ప్రకారం.. భారతీయుల్లో కేవలం 39 శాతం మంది మాత్రమే తమను తాము శాఖాహారులమని చెప్పుకుంటారు. మిగిలిన 61 శాతం మంది నాన్-వెజ్ ఫుడ్ తింటారు. అయినప్పటికీ వారి విశ్వాసం తినే ఎంపికలో.. మాంసం ఎంపికలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

భారతీయ జనాభా మతపరమైన ఆహారపు అలవాట్లు

భారతదేశంలో దాదాపు 92 శాతం జైనులు శాఖాహారులు. మతాలన్నింటిలో దీనిలోనే శాఖహారులు గరిష్టంగా ఉన్నారు. 59 శాతంతో సిక్కులు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. మిగిలిన వారు మాంసాహారులుగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే హిందూ జనాభాలో సగానికి పైగా మాంసాహారం తినేవారేనంటూ నివేదిక వెల్లడించింది. దేశంలోని మెజారిటీ మతంలో 44 శాతం శాకాహారులు – 56 శాతం మాంసాహారులు ఉన్నారని నివేదిక పేర్కొంది.

ఇతర మతాలలో దాదాపు నలుగురిలో బౌద్ధులలో ఒకరు శాకాహారులు.. అయితే క్రైస్తవులలో పది మందిలో ఒకరు మాత్రమే శాకాహారులు ఉన్నారు. శాకాహారుల్లో ముస్లింలు మాత్రమే తక్కువగా ఉన్నారు. డేటా ప్రకారం ముస్లింలలో కేవలం 8 శాతం మాత్రమే శాకాహారులుగా ఉన్నారు.

మాంసం ఎంపిక మత విశ్వాసంపై ఎలా ఆధారపడి ఉంటుంది?

అన్ని మతాలు అన్ని రకాల మాంసాహారాన్ని అనుమతించవు. ఉదాహరణకు.. హిందువులు ఆవును భగవంతుని పవిత్ర రూపంగా భావిస్తారు. అందువల్ల వారిలో బీఫ్ మాంసం తినడం నిషేధించడమైనది. ముస్లింలు తమ మత విశ్వాసాల ప్రకారం.. పంది మాంసం తినడం నిషేధించడమైనది. ఈ నమ్మకాలు వ్యక్తి మతపరమైన గుర్తింపును ప్రశ్నించేంత బలంగా ఉన్నాయి.

మాంసం తినడం అనేది మత విశ్వాసాలకు సంబంధించినది..

ప్యూ రీసెర్చ్ ప్రకారం.. దాదాపు 72 శాతం మంది భారతీయ హిందువులు ఒక వ్యక్తి గొడ్డు మాంసం (ఆవు మాంసం) తింటే.. అలాంటి వ్యక్తి మతంలో సభ్యుడు కాలేడని భావిస్తున్నారు. సిక్కుల్లో (82 శాతం) కూడా గొడ్డు మాంసం తినకూడదని విశ్వసిస్తారు. అదేవిధంగా ముస్లింలు (77 శాతం) పంది మాంసం తినే వారిపై కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అయితే.. బౌద్ధులు, జైనులు సమాజంలో మాంసాన్ని తినడాన్ని అస్సలు సమ్మతించరు.

ఏటా పెరుగుతున్న మాంసం విక్రయాలు..

ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) ప్రచురించిన డేటా ప్రకారం.. భారతదేశంలో మాంసం వినియోగం గత ఏడు సంవత్సరాలుగా స్థిరమైన పెరుగుదలను చూసింది. వీటిలో గొడ్డు మాంసం, పంది, పౌల్ట్రీ, గొర్రె మాంసం ఉంది. ఈ నాలుగు రకాల మాంసాల వినియోగం దేశంలో పెరుగుతున్నట్లు నివేదించింది.

భారతదేశంలో ఏడాది మాంసం వినియోగం (మెట్రిక్ టన్నులలో)

తాజా గణాంకాల ప్రకారం.. చికెన్ (పౌల్ట్రీ) అనేది భారతీయులలో ఇష్టమైన మాంసం. ఆ తర్వాత గొడ్డు మాంసం. 2021 సంవత్సరంలో భారతీయులు 3372 మెట్రిక్ టన్నుల చికెన్‌ను వినియోగించగా.. 1049 మెట్రిక్ టన్నుల గొడ్డు మాంసం, అదే విధంగా పంది మాంసం, గొర్రెల మాంసం 401 – 725 మెట్రిక్ టన్నుల్లో వినియోగించారు.

2016 గణాంకాలతో పోల్చితే.. చికెన్‌లో వినియోగంలో గరిష్ట వృద్ధి కనిపించింది. ఈ వినియోగం 20 శాతానికి పైగా పెరిగింది. 2016లో దేశంలో 2865 మెట్రిక్ టన్నుల కోళ్ల మాంసం విక్రయించగా.. అది 3467 మెట్రిక్ టన్నులకు పెరిగింది. పంది మాంసం వినియోగంలో 15 శాతం వృద్ధిని సాధించింది. అయితే గొడ్డు మాంసం వార్షిక వినియోగంలో 8 శాతం పెరిగింది. OECD డేటా ప్రకారం 2016లో ఉన్న దానితో పోలిస్తే గొర్రె మాంసం వినియోగంలో అతి తక్కువ (3.1 శాతం) పెరుగుదలను మాత్రమే నివేదించింది.

-ఆకాష్ గులాంకర్, వ్యాసకర్త

Also Read:

Fire Accident: మూగజీవాల ప్రాణం తీసిన డంపింగ్ యార్డ్.. గోశాలలోని 38 ఆవులు అగ్నికి ఆహుతి..

Ukraine: యుద్ధాన్ని సైతం లెక్క చేయని ప్రేమ జంట.. ఉక్రెయిన్‌ అమ్మాకికి ప్రపోజ్‌ చేసిన భారత లాయర్‌.. ఢిల్లీలో వివాహం