Ukraine: యుద్ధాన్ని సైతం లెక్క చేయని ప్రేమ జంట.. ఉక్రెయిన్ అమ్మాకికి ప్రపోజ్ చేసిన భారత లాయర్.. ఢిల్లీలో వివాహం
Ukraine: గత కొన్ని రోజుల నుంచి ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా బాంబుల వర్షం కురుస్తుండటంతో అన్నా హొరోడెట్స్కా తన అద్దె అపార్ట్‌మెంట్‌కు..
Ukraine: గత కొన్ని రోజుల నుంచి ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా బాంబుల వర్షం కురుస్తుండటంతో అన్నా హొరోడెట్స్కా అనే మహిళ తన అద్దె అపార్ట్‌మెంట్‌కు తాళం వేసి, కేవలం రెండు టీ-షర్టులు, కాఫీ మెషీన్‌ను తీసుకుని భారతదేశానికి వచ్చేసింది. బాంబుల దాడులు, కాల్పుల మోతల మధ్య కొందరు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు తమ మనస్సులోనే దాచుకున్న ప్రేమను తమ పార్టనర్స్‌తో పంచుకున్నారు. అలా యుద్ధాన్ని సైతం ప్రేమ లెక్క చేయలేదు. యుద్ధం సృష్టించిన కల్లోలాన్ని దాటి… ఉక్రెయిన్ అమ్మాయి… భారత్‌కు చెందిన అబ్బాయిని పెళ్లాడింది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ అమ్మాయి.. భారత్‌కు చెందిన అబ్బాయి ప్రేమించుకున్నారు. అయితే త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఊహించని విధంగా యుద్ధం రావడంతో వారి జీవితాల్లో అడ్డంకులు మొదలయ్యాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం పెను తుఫానుగా మారిపోయింది. ఎన్నో అడ్డంకులను దాటి.. ఎట్టకేవలకు ఒక్కటైంది ఆ జంట. అమ్మాయి తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒక కాఫీ మెషీన్, రెండు టీషర్టులను తీసుకుని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి భారత్‌కు చేరుకుంది.అలా ఆమె మార్చి 17న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే ప్రేమించిన న్యాయవాది అభినవ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. అక్కడే వేలికి ఉంగరం కూడా తొడిగాడు.
రెండున్నరేళ్ల కిందట పరిచయం..
కాగా, అనుభవ్ బాసిన్ (34), అన్నా హోరోడెట్స్కా (30) రెండున్నర సంవత్సరాల కిందట కలుసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరికి పరిచయం అయింది. తర్వాత దుబాయ్‌లో కలిశారు. ఆ తర్వాత సోషల్ మీడియాల ద్వారా యాక్టివ్‌గా ఉంటూ ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అన్నా ఓ ఐటీ కంపెనీలో పనిచేయగా, అనుభవ్ ఢిల్లీ హైకోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారిపోయింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సదరు మహిళ ప్రేమించిన వ్యక్తిని చూడకుండా ఉండలేక పెళ్లి చేసుకునేందుకు ఉక్రెయిన్ రాజధాని కైవ్ నుంచి భారత్‌కు రావాలని నిర్ణయించుకుని వీసా కోసం ఇండియన్ ఎంబసీకి దరఖాస్తు చేసుకుంది. ఇక వీసా రావడమే తరువాయి వెంటనే ఇండియాకు వచ్చేసింది. ఆమె రాగానే అనుభవ్ ఎంతో ఆనందంతో ప్రపోజ్ చేశాడు. ఆదివారం ఈ జంట ఢిల్లీలో ఓ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ నెలాఖరులో వారు తమ వివాహాన్ని చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యేలా కోర్టులో నమోదు చేయనున్నారు. ప్రస్తుతం ఆమెకు ఏడాది పాటు వీసా ఉంది.
ఇవి కూడా చదవండి: