MG Motor India: ఎంజీ మోటార్స్‌ ఇండియా కీలక నిర్ణయం.. చిన్న ఎలక్ట్రిక్‌ వాహనాలు..!

MG Motor India: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక వాహనాల..

MG Motor India: ఎంజీ మోటార్స్‌ ఇండియా కీలక నిర్ణయం.. చిన్న ఎలక్ట్రిక్‌ వాహనాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 12, 2022 | 11:46 AM

MG Motor India: ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక వాహనాల తయారీలో ఎంజీ మోటార్‌ (MG Motor) ఇండియాలో రెండో ప్లాంట్‌ (Second Plant)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంవత్సరానికి 1.75 లక్షల యూనిట్ల కార్లను తయారు చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం రూ.4వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది. గుజరాత్‌లో ఇప్పటికే కంపెనీకి తయారీ కేంద్రం ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 70వేల యూనిట్లు. దీని వచ్చే సంవత్సరం నాటికి 1.25 లక్షల యూనిట్లకు పెంచాలని కంపెనీ భావిస్తోంది. కొత్త ప్లాంట్‌ కోసం గుజరాత్‌ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ రాజీవ్‌ ఛాబా తెలిపారు. రెండేళ్లలో వార్షిక తయారీ సామర్థ్యం 3 లక్షల యూనిట్ల వరకు చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే ప్లాంట్‌ను కొనుగోలు చేయాల్సిందిగా పలు కంపెనీల నుంచి ఆఫర్‌ అందుకున్నామని, జూన్‌ చివరి నాటికి కొత్త ప్లాంట్‌ చివరి దశకు చేరుకుంటుందని అన్నారు.

రెండేళ్లలో కొత్త కేంద్రానికి ప్రయత్నాలు..

రెండు సంవత్సరాలలో నూతన కేంద్రం సిద్ధమవుతోందని రాజీవ్‌ అన్నారు. ఇందు కోసం కావాల్సిన పెట్టుబడి కంపెనీ, వాణిజ్య రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం దగ్గర ఎఫ్‌డీఐ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. గుజరాత్‌ ప్లాంట్‌ సామర్థ్యం పెంచేందుకు రూ.2,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు గత ఏడాదే ప్రకటించింది.

2021లో 40,000 వాహనాల విక్రయం:

కాగా, 2021లో భారత్‌లో కంపెనీ 40,000 వానాలను విక్రయించింది. చిప్‌ల కొరత ఉన్నప్పటికీ ఈ సంవత్సరం 70 వేలు, వచ్చే ఏడాది 1.25 లక్షలయూనిట్ల కార్ల అమ్మకాలు నమోదు చేస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. చిన్న ఎలక్ట్రిక్‌ వాహనాలు 2023 మార్చి-ఏప్రిల్‌ మధ్యలో భారత్‌లో రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలిపారు. దీని ధర రూ.10-15 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

PF Account -PAN: మీ పీఎఫ్‌ ఖాతాను పాన్‌ కార్డుతో లింక్‌ చేయండి.. పన్ను ఆదా చేసుకోండి.. ఎలాగంటే..

EPFO Update: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేయడం ఎలా..?

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.