EPFO Update: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేయడం ఎలా..?

EPFO Update: ప్రతి ఉద్యోగికి పీఎఫ్‌ అనేది ఎంతో ఉపయోగకరమైనది. భవిష్యత్తులో ఈ పీఎఫ్‌ (EPF) డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. పీఎఫ్‌ అకౌంట్‌..

EPFO Update: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేయడం ఎలా..?
Follow us
Subhash Goud

|

Updated on: Apr 12, 2022 | 7:43 AM

EPFO Update: ప్రతి ఉద్యోగికి పీఎఫ్‌ అనేది ఎంతో ఉపయోగకరమైనది. భవిష్యత్తులో ఈ పీఎఫ్‌ (EPF) డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. పీఎఫ్‌ అకౌంట్‌ ఉన్న వారికి ప్రతినెల అకౌంట్‌ (Account)లోకి డబ్బులు జమ అవుతుంటాయి. ప్రతీ నెల జమ అయ్యే డబ్బుల వివరాలు మీ మొబైల్‌ (Mobile)కు ఎస్ఎంఎస్ (SMS) లేదా ఇమెయిల్‌లో వస్తుంది. కానీ కొందరికి మెసేజ్‌ రాదు. అందుకు కారణం మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ సరిగ్గా లేకపోవచ్చు. మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్‌కి పాత మొబైల్, పాత ఇమెయిల్ ఐడీ ఇచ్చారేమో ఓసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో పాత మొబైల్ నెంబర్, పాత ఇమెయిల్ ఐడీ ఉంటే మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. బ్యాంకింగ్‌ సర్వీసుల నుంచి ఈపీఎఫ్‌ వరకు అన్ని కూడా ఆన్‌లైన్‌లోనే చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఇలా పీఎఫ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లోనే మీ మొబైల్ నెంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయవచ్చు. EPFO పోర్టల్‌లో సులభంగా మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

☛ ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి.

☛ ఆ తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మరియు పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్ అవండి.

☛ ఆ తర్వాత manage సెక్షన్ పైన క్లిక్ చేయండి.అందులో contact details పైన క్లిక్ చేయండి.

☛ పాత మొబైల్ నెంబర్ ఉంటే change mobile number పైన క్లిక్ చేయాలి.

☛ మీ కొత్త మొబైల్ నెంబర్‌ను రెండు సార్లు ఎంటర్ చేయాలి.

☛ Get Authorization Pin పైన క్లిక్ చేయాలి.

☛ మీ కొత్త మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

☛ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

☛ ఈపీఎఎఫ్ అకౌంట్‌లో కొత్త మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది.

ఈ-మెయిల్‌ ఐడీ మార్చడం ఎలా..?

☛ ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి.

☛ ఆ తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మరియు పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్ అవండి.

☛ ఆ తర్వాత manage సెక్షన్ పైన క్లిక్ చేయండి.

☛ అందులో contact details పైన క్లిక్ చేయండి.

☛ పాత ఇమెయిల్ ఐడీ ఉంటే Change E-Mail Id పైన క్లిక్ చేయండి.

☛ మీ కొత్త ఇమెయిల్ ఐడీని రెండు సార్లు ఎంటర్ చేయాలి.

☛ Get Authorization Pin పైన క్లిక్ చేయాలి.

☛ మీ కొత్త ఇమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.

☛ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.

☛ ఈపీఎఎఫ్ అకౌంట్‌లో కొత్త ఇమెయిల్ అప్‌డేట్ అవుతుంది.

☛ ఇక ఇప్పటికే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అకౌంట్‌లో వడ్డీ జమ చేస్తోంది. మీ మొబైల్ నెంబర్,

☛ ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేస్తే వడ్డీ జమ కాగానే మీకు వివరాలు వెంటనే తెలుస్తాయి.

ఇవి కూడా చదవండి:

Ration Card: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో రేషన్‌ కార్డు నిబంధనల్లో మార్పులు..!

Be Careful: ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌.. యాప్స్‌ కోసం గూగుల్‌లో వెతుకుతున్నారా..? ప్రమాదంలో పడినట్లే..

Dangerous Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 10 యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి