AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో రేషన్‌ కార్డు నిబంధనల్లో మార్పులు..!

Ration Card: పేదలకు ఆహార సరుకులు అందించడంతో కీలక పాత్ర పోషించేది రేషన్‌ కార్డు. రేషన్‌ కార్డు నుంచి పొందే సరుకులు ఉచితంగా పొందడం..

Ration Card: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో రేషన్‌ కార్డు నిబంధనల్లో మార్పులు..!
Subhash Goud
|

Updated on: Apr 12, 2022 | 7:02 AM

Share

Ration Card: పేదలకు ఆహార సరుకులు అందించడంతో కీలక పాత్ర పోషించేది రేషన్‌ కార్డు. రేషన్‌ కార్డు నుంచి పొందే సరుకులు ఉచితంగా పొందడం వల్ల ఎంతో ఆసరాగా నిలుస్తోంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత పేద ప్రజలను ఆదుకోవడం కోసం వారి జీవనోపాధికి ఆసరాగా నిలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(PM-GKY) పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే 26 మార్చి 20202న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM-GKY కింద రూ.2.76 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వం.. ఉచిత రేషన్ పథకం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని సెప్టెంబర్ 2022 వరకు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇదే విధమైన రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగించింది.

అయితే ఆహార, ప్రజా పంపిణీలో ప్రస్తుతం రేషన్‌ కార్డు నిబంధనలలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది మోడీ సర్కార్‌. రేషన్‌ కార్డు అర్హత, మార్పులపై రాష్ట్రాలతో కేంద్రం సమావేశం నిర్వహించనుంది. రేషన్‌ కార్డు కోసం కొన్ని ప్రమాణాలు మార్పుల చేయనుంది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే డేటా ప్రకారం.. ప్రస్తుతం 80 కోట్ల మందికిపైగా ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే ఆర్థికంగా స్థిరంగ ఆఉన్న కొందరు ఉన్నారని, అయినప్పటికీ వారు ఉచిత రేషన్‌ పథకాన్ని ఉపయోగిస్తున్నారని నివేదికలు వెల్లడవుతున్నాయి. దీనిని వీటిని ధృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని దృష్టిలో ఉంచుకుని ‘ఒకే దేశం, ఒకే రేషన్‌ కార్డు’ను ప్రారంభించింది. అయితే మునుపటిలా కాకుండా ఇప్పుడు చెల్లుబాటు అయ్యే రేషన్‌ కార్డును కలిగినవున్న ఎవరైనా దేశంలోని ఏ రాష్ట్రం నుంచి అయినా ఉచితంగా రేషన్‌ పొందవచ్చు. ఇంతకు ముందు రేషన్‌ కార్డుదారుని సొంత రాష్ట్రంలో మాత్రమే రేషన్‌ పొందేందుకు అర్హత ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పొందే వెసులుబాటు ఉంది.

ఇవి కూడా చదవండి:

Russia-Ukraine War Effect: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌.. 23 శాతం పెరిగిన వంట నూనె ధరలు

Electric Vehicle Sales: జోరుగా కొనసాగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు.. మూడింతలు పెరిగిన సేల్స్‌!