AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Vehicle Sales: జోరుగా కొనసాగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు.. మూడింతలు పెరిగిన సేల్స్‌!

Electric Vehicle Sales: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ధరలను దృష్టిలో..

Electric Vehicle Sales: జోరుగా కొనసాగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు.. మూడింతలు పెరిగిన సేల్స్‌!
Subhash Goud
|

Updated on: Apr 11, 2022 | 8:33 AM

Share

Electric Vehicle Sales: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ధరలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric Vehicle) వైపు మొగ్గు చూపుతున్నారు. గతం కంటే పోల్చుకుంటే ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగిపోతోంది. 2020-21తో పోలిస్తే గ‌త ఆర్థిక సంవత్సరంలో ఈవీ వాహనాలు మూడింతలు పెరిగాయని ఆటో మోబల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఫెడరేషన్‌ (ఫాడా) తెలిపింది. టూ వీలర్స్‌ సేల్స్‌ ఐదు రేట్ల వరకు నివేదికలు చెబుతున్నాయి. 2020-21లో 1.34,821 ఎలక్ట్రిక్‌ వాహనాలు సేల్స్‌ అయితే, 2021-22లో 4,29,217 యూనిట్లు విక్రయించారు. కోవిడ్‌కు ముందు అంటే 2019-20లో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు1,68,300 వ‌ద్ద నిలిచాయి.

మూడింతలు పెరిగిన ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు:

ఎలక్ట్రిక్‌ వాహనాలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత విక్రయాలు మూడింతలు పెరిగినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. 2020-21లో 4,984 ఎలక్ట్రిక్‌ యూనిట్ల విక్రయాలు జరిగితే, గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2021-22లో 17,802కు చేరాయి. హోం గ్రోన్ ఆటోమేజ‌ర్ టాటా మోటార్స్ 15,198 ఎలక్ట్రిక్‌ కార్లు విక్రయించింది. మొత్తం ఈవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ వాటా 85.37 శాతం ఉంది. 2020-21లో కేవ‌లం 3,523 విద్యుత్ వేరియంట్ కార్లు మాత్రమే విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్‌ కార్ల సేల్స్‌లో ఎంజీ మోటార్స్ ఇండియా 2020-21లో 1,115 యూనిట్లు విక్రయిస్తే, గ‌త సంవత్సరం 2,045 కార్ల విక్రయించింది. మొత్తం మార్కెట్ షేర్ 11.49 శాతం ఉంది. ఇక మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హ్యుండాయ్ మోటార్ ఇండియా మూడో, నాలుగో స్థానంలో ఉన్నాయి. మ‌హీంద్రా 156 యూనిట్లు విక్రయిస్తే హ్యుండాయ్ కార్లు 128 విక్రయాలు కొనసాగాయి. మొత్తం కార్ల విక్రయాలలో 1శాతం లోపే ఉన్నాయి. అలాగే 2020-21లో మ‌హీంద్రా 94, హ్యుండాయ్ 184 కార్లు విక్రయాలు జరిగినట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి.

పెరిగిన టూ వీలర్స్‌ సేల్స్‌:

2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో టూవీలర్స్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల రిటైల్‌ సేల్స్‌ 2,31,338 యూనిట్లకు చేరాయి. 2020-21లో కేవ‌లం 41,046 ద్విచక్ర వాహణాల విక్రయాలు జరిగాయి. ఇక టూవీలర్స్‌ సెగ్మెంట్‌లో హీరో ఎలక్ట్రిక్‌దే ప్రధాన వాటగా నిలిచింది. 65,303 యూనిట్లు బైక్స్‌, స్కూటీలు విక్రయాలు జరిగాయి. ఇక ఒకినావా ఆటో 46,447 బైక్‌లు, అంపేర్ వెహిక‌ల్స్ 24,648, హీరో మోటో కార్ప్స్ సార‌ధ్యంలోని ఏథేర్ ఎన‌ర్జీ 19,971 యూనిట్లు విక్రయించాయి.

ఆరో స్థానంలో ఓలా..

బెంగళూరు కేంద్రంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ ఆరో స్థానంలో ఉంది. ఓలా స్కూటర్స్‌ 14,371 యూనిట్లు అమ్ముడు కాగా, టీవీఎస్‌ మోటార్స్‌ కంపెనీ 9,458 బైక్‌లు, స్కూటీలను విక్రయించింది. ఇక వాణిజ్య వాహనాల (EV) విక్రయాల్లోనూ పురోగతి నమోదైంది. 2020-21లో 400 యూనిట్లు విక్రయించగా, గత ఆర్థిక సంవత్సరంలో 2,203 యూనిట్లకు పెరిగాయి.

ఇవి కూడా చదవండి:

Nominee Name: బ్యాంకు అకౌంట్‌, పీఎఫ్‌, ఇతర పథకాలలో నామినీ పేరు ఎందుకు చేర్చాలి..? దాని వల్ల ఉపయోగం ఏమిటి?

Fixed Deposits: ఆ బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్‌.. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు.. తాజా రేట్ల వివరాలు