Dangerous Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 10 యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి

Dangerous Apps: ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడమే కాకుండా బ్యాంకులో..

Dangerous Apps: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ 10 యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి
Follow us
Subhash Goud

|

Updated on: Apr 11, 2022 | 1:05 PM

Dangerous Apps: ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడమే కాకుండా బ్యాంకులో ఉన్న డబ్బంతా తస్కరిస్తున్నారు నేరగాళ్లు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది నేరాల సంఖ్య పెరిగిపోతున్నారు. కొన్ని నకిలి యాప్స్‌ల ద్వారా కూడా నిలువునా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని గూగుల్‌ ప్లేప్టోర్‌లో ఉండే యాప్స్‌ వల్ల ప్రమాదం పొంచివుంటుంది. అలాంటి యాప్స్‌ (Apps)ను వెంటనే డిలీట్‌ చేసుకోవాలని గూగుల్‌ సూచిస్తూ ఉంటుంది. ప్లే స్టోర్స్‌లో యాప్స్‌ను కన్చించేలా హ్యకర్లు చేస్తున్నారు. కాగా తాజాగా గూగుల్‌ ప్లే స్టోర్‌లోని పలు యాప్స్‌ యూజర్లకు హాని కల్గించే 10 యాప్స్‌ను గూగుల్‌ గుర్తించింది. మీమీ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయాలని సూచిస్తోంది.

గూగుల్‌ బ్యాన్‌ చేసిన పది పాపులర్‌ యాప్స్‌ యూజర్ల డేటాను తస్కరిస్తున్నాయని తెలిపింది. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక ప్రకారం.. నిషేధం విధించిన యాప్‌లు ఇప్పటి వరకు 60 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ అయినట్లు గూగుల్‌ గుర్తించింది. ఈ యాప్‌లను ఉపయోగించి ఈ-మెయిల్స్‌, ఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లను హ్యకర్లు దొంగిలిస్తున్నట్లు తెలిసింది. అదనంగా హ్యకర్లు ఈ యాప్స్‌ సహాయంతో యూజర్ల వాట్సాప్‌ను కూడా యాక్సెస్‌ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ నిషేధించిన 10 యాప్స్‌

స్మార్ట్‌ కిట్‌ 360 (Smart kit 360), స్పీడ్‌రాడార్‌ కెమెరా (Speed Radar Camera), AI-Moazin లైట్, Wi-Fi మౌస్ (Remote Control PC), QR & బార్‌కోడ్ స్కానర్‌ (QR & Barcode Scanner), Qibla కంపాస్ – రంజాన్ 2022 (Qibla Compass – Ramadan 2022), Audiosdroid ఆడియో స్టూడియో DAW (Audiosdroid Audio Studio DAW), సింపుల్‌ వెదర్‌ అండ్‌ క్లాక్ విడ్జెట్ ( Simple Weather & Clock Widget (Developed by Difer), హ్యాండ్‌సెంట్ నెక్స్ట్‌ SMS- టెక్స్ట్‌ విత్‌ ఎంఎంఎస్‌ (Handcent Next SMS- Text With MMS), ఫుల్‌ ఖురాన్ MP3-50 లాంగ్వేజ్స్‌ అండ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆడియో ( Full Quran MP3-50 Languages & Translation Audio).లాంటి యాప్స్‌ వల్ల ప్రమాదం ఉందని, ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయాలని సూచిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Whatsapp: మీ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ యాప్‌కు లాక్‌-అన్‌లాక్‌ చేయడం ఎలా..?

Whatsapp Shortcuts: వాట్సాప్‌ యూజర్ల కోసం.. ఈ 10 షార్ట్‌కట్స్‌ గురించి మీకు తెలుసా..?