Whatsapp Shortcuts: వాట్సాప్‌ యూజర్ల కోసం.. ఈ 10 షార్ట్‌కట్స్‌ గురించి మీకు తెలుసా..?

Subhash Goud

Subhash Goud |

Updated on: Apr 11, 2022 | 10:00 AM

Whatsapp Shortcuts: ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగం పెరిగిపోయింది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు స్మార్ట్‌ఫోన్‌లో మునిగి తేలుతుంటారు..

Whatsapp Shortcuts: వాట్సాప్‌ యూజర్ల కోసం.. ఈ 10 షార్ట్‌కట్స్‌ గురించి మీకు తెలుసా..?

Follow us on

Whatsapp Shortcuts: ప్రస్తుతం వాట్సాప్‌ వినియోగం పెరిగిపోయింది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు స్మార్ట్‌ఫోన్‌లో మునిగి తేలుతుంటారు. అయితే వర్క్‌ ఫ్రం హోం విధానం ఎక్కువైన తర్వాత వాట్సాప్‌ వినియోగం మరింతగా పెరిగిపోయింది. ఆఫీస్‌ వర్క్‌ కోసం డెస్క్‌టాప్‌ (Whatsapp Desktoలో ట్యాబ్‌లను ఓపెన్‌ చేసుకోవడంతోపాటు ‘వెబ్‌ వాట్సాప్‌’ను ఓ భాగం చేసుకుంటూ ఉంటారు. అయితే మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఓపెన్‌ చేస్తుంటారు. దీని వల్ల సమయం వృథా అయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా ముఖ్యమైన సందేశం వస్తేనే చూసుకోవడానికి నోటిఫికేషన్‌ అలర్ట్‌ను పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వాట్సాప్‌ వెబ్ కోసం ప్రత్యేకంగా కొన్ని షార్ట్‌కట్‌లు ఉన్నాయి. అవి ఏమిటో ఓ సారి చూద్దాం..

  1. మార్క్‌ యాజ్‌ అన్‌రీడ్‌: వాట్సాప్‌ గ్రూపుల్లో ఏదైనా మెసేజ్‌ వచ్చినప్పుడు ఓపెన్‌ చేసి చూస్తుంటాము. అప్పుడు పంపిన వ్యక్తికి మనం ఆ మెసేజ్‌ను చూసినట్లు తెలిసిపోతుంది. అలాకాకుండా మెసేజ్‌ను చూడకుండా ఉండేలా కూడా చేయవచ్చు. ctrl+alt+shift+u క్లిక్‌ చేస్తే అన్‌రీడ్‌ మోడ్‌లోకి మారిపోతుంది.
  2. సెర్చ్‌ చాట్‌: వాట్సాప్‌ గ్రూపుల్లోని చాటింగ్‌ సెక్షన్‌లో సెర్చ్‌ చేసుకోవడం సులభంగా చేసుకోవచ్చు. చాటింగ్ సెక్షన్‌ కోసం ctrl+alt+shift+f క్లిక్‌ చేస్తే సరిపోతుంది.
  3. పిన్‌ చాట్‌: సాధారణంగా ముఖ్యమైన వాట్సాప్‌ గ్రూపులు ఉంటే మనకు ఎప్పుడు ముందు కనిపించేలా పిన్‌ చాట్‌ చేస్తుంటాము. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం షార్ట్‌కట్‌లో ctrl+alt+shift+p క్లిక్‌ చేస్తే సరిపోతుంది.
  4. న్యూ గ్రూప్‌, న్యూ చాట్‌: కొత్తగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకునేందుకు ctrl+alt+shift+N క్లిక్‌ చేయాలి. ఇక న్యూ చాట్‌ కోసం ctrl+alt+N ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
  5. ఎగ్జిట్‌ గ్రూప్‌: ఏదైనా గ్రూపు నుంచి బయటకు వెళ్లిపోవాలంటే సాధారణంగా గ్రూప్‌లోని మూడు చుక్కలపై క్లిక్‌ చేసి ఎగ్జిట్‌ గ్రూప్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ctrl+alt+Backspace ప్రెస్ చేస్తే సరిపోతుంది. వ్యక్తిగత చాట్‌లో మెసేజ్‌లను క్లియర్‌ చేసుకోవడానికి దీనిని వాడుకోవచ్చు.
  6. ఇన్‌క్రీజ్‌ లేదా డిక్రీజ్‌ స్పీడ్‌ ఆప్‌ సెలెక్టెడ్‌ వాయిస్‌ మెసేజ్‌: మీరు ఎంచుకున్న వాయిస్ మెసేజ్‌ స్పీడ్‌ను పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్‌ ఉంది. shift+. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
  7. సెట్టింగ్స్‌: వాట్సాప్‌ సెట్టింగ్‌లోకి వెళ్లాలంటే ఏవేవో నొక్కాల్సిన అవసరం లేదు. ముందుగా మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటిదేమి ఉండకుండా డైరెక్ట్‌గా వెళ్లాలంటే ctrl+alt+, క్లిక్‌ చేస్తే సరిపోతుంది.
  8. మ్యూట్‌: ఒక గ్రూప్‌ నుంచి వచ్చే నోటిఫికేషన్స్‌ను మ్యూట్‌ చేయాలంటే సింపుల్‌. ctrl+alt+shift+M ప్రెస్‌ చేస్తే సరిపోతుంది.
  9. ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌: యూజర్‌ ప్రొఫైల్‌ అండ్‌ ఎబౌట్‌ సెక్షన్‌కు వెళ్లేందుకు సింపుల్‌గా ఉంటుంది. ctrl+alt+P క్లిక్‌ చేస్తే సరిపోతుంది.
  10. ఆర్కివ్‌ చాట్‌: మామూలుగా డెస్క్‌టాప్‌లో ఏదైనా గ్రూప్‌ను గానీ, వ్యక్తిగత చాటింగ్‌ను ఆర్కివ్‌ చేయాలంటే సులభం చేసుకోవచ్చు. అందుకు ctrl+alt+e క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి:

Mosquito Bites: దోమలు కొందరికి మాత్రమే కుడతాయి.. కారణం ఏమిటి.. పరిశోధనలలో తేలిన నిజాలు!

Google Play Store: ప్లేస్టోర్‌లోని యాప్‌లకు షాకిచ్చిన గూగుల్‌.. అప్‌డేట్‌ ఇవ్వని యాప్‌లపై కీలక నిర్ణయం..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu