AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquito Bites: దోమలు కొందరికి మాత్రమే కుడతాయి.. కారణం ఏమిటి.. పరిశోధనలలో తేలిన నిజాలు!

Mosquito Bites: చాలా మంది ఇండ్లల్లో దోమల బెడద ఉంటుంది. అయితే కొందరికి దోమలు కుట్టవు. అందరు ఒక చోట కూడితే అందులో కొందరికి కుడితే మరి కొందరికి కుట్టవు..

Mosquito Bites: దోమలు కొందరికి మాత్రమే కుడతాయి.. కారణం ఏమిటి.. పరిశోధనలలో తేలిన నిజాలు!
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 10, 2022 | 8:16 AM

Share

Mosquito Bites: చాలా మంది ఇండ్లల్లో దోమల బెడద ఉంటుంది. అయితే కొందరికి దోమలు కుట్టవు. అందరు ఒక చోట కూడితే అందులో కొందరికి కుడితే మరి కొందరికి కుట్టవు. కొందరు ఎక్కడున్న దోమలు వారికి వెంటాడుతుంటాయి. అలాంటి వారు చాలా ఇబ్బంది పడతారు. నలుగురిలో కొందరు దోమలు (Mosquito) కుడుతుంటే మరి కొందరిని చూసి దోమ‌లు కుడుతున్న వీడికి చ‌ల‌న‌మే లేద‌ని అనుకుంటారు. కానీ నిజానికి వాళ్ల‌ను దోమ‌ల్ని కుట్ట‌వు. కొంత‌మందికి మాత్ర‌మే దోమ‌లు కుడ‌తాయి. మిగిలిన వాళ్ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోవు. మరి అలాంటి వారికి దోమలు కుట్టకపోవడం వెనుక కారణంగా కూడా ఉంది. దీనిపై పలు అధ్యయనాలు కూడా నిర్వహించారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

దోమలకు ఉదయం పూట కళ్లు పెద్దగా కనిపించవట. మధ్యాహ్నం నుంచి వాటి చూపు మెరుగుపడుతుంది. ఇక సాయంత్రం, రాత్రి అయ్యిందంటే వాటి కళ్లు బాగా కనిపిస్తాయట. అయితే ఇంట్లోకి రాగానే అవి డార్క్‌ కలర్‌ బట్టలు వేసుకున్న వాళ్లను మాత్రమే టార్గెట్‌ చేస్తాయంటున్నారు నిపుణులు. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్న వారిని ఎక్కువగా దోమలు కుడతాయి. మనం ఆక్సిజన్‌ పీల్చుతూ కార్బన్‌ డై ఆక్సైడ్‌ను వదులుతామనే విషయం అందరికి తెలిసిందే. దోమలకు కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంటే ఎంతో ఇష్టం. 160 అడుగుల దూరంలో ఉండి కూడా కార్బన్‌ డై ఆక్సైన్‌ వాసనను గుర్తించే సామర్థ్యం ఉంటుంది దోమలకు. లావుగా ఉన్నవాళ్లు, అధిక బరువు ఉన్న వారు ఎక్కువగా కార్బన్‌ డైఆక్సైన్‌ను విడుదల చేస్తారు. అందుకే వారిని ఎక్కువగా దోమలు కుడుతుంటాయని పలు పరిశోధనలలో స్పష్టం అయ్యింది.

దోమలు చెమట వాసనను గుర్తిస్తాయి..

దోమలు చెమట వాసనను గుర్తిస్తాయి. మన శరీరం నుంచి వచ్చే చెమటలో లాక్టిక్‌ యాసిడ్‌, యూరిక్‌ యాసిడ్‌, అమ్మోనియం వంటివి ఉంటాయి. అవి దోమలకు ఎంతో ఇష్టమట. ఎవరైనా బాగా శ్రమించి చెమటతో ఉంటే వారిని కుట్టేస్తాయట. చెమట వాసన ద్వారా దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయని 2015లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. అలాగే శరీరంపై దుర్వాస ఉంటే దోమలు త్వరగా ఆకర్షితులవుతాయని 2011లో నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది.

శరీరంపై స్కీన్‌ శుభ్రంగా ఉండాలి:

మన శరీరంపై స్కీన్‌ శుభ్రంగా ఉండాలి. అలాగే కురుపులు, గాయాలు ఉండకుండా చూసుకోవడం మంచిది. చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. గాయాలు, కురుపులు ఉండటం కారణంగా సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దోమలు కూడా ఎక్కువగా వాలుతాయి.

గర్బిణులపై..

ఇక గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువగా కార్బన్‌డై ఆక్సైడ్‌ విడుదల చేస్తారు. అందుకే అలాంటి వాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయి. ఆఫ్రికాలో గర్భంతో ఉన్న మహిళలకు మలేరియా ఎక్కువగా సోకుతున్నదని ఓ పరిశోధనలలో తేలింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణులను 21 శాతం ఎక్కువగా కుడతాయని తేలింది. మన శరీరం వేడిని ఉత్పత్తి చేస్తుంది. మన చర్మానికి దగ్గరగా ఉండే నీటి ఆవిరి స్థాయిలు పరిసర ఉష్ణోగ్రతను బట్టి మారవచ్చు.

మద్యం సేవించిన వారికి..

మద్యం సేవించిన వారిపై కూడా 2002లో ఓ అధ్యయనం నిర్వహించారు శాస్త్రవేత్తలు. బీర్‌ తాగని వారికంటే ఎక్కువగా తాగేవారికి దోమలు ఎక్కుగా ఆకర్షిస్తాయని పరిశోధకులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

Watermelon: పుచ్చకాయ కట్‌ చేయకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?

Fitness Tips: మీరు జిమ్‌లో ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తున్నారా..? ప్రమాదమే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!