Knowledge: వామ్మో! ఈ కీటకం చాలా డేంజర్‌ గురూ.. దగ్గరికెళ్లారో అంతే సంగతులు..

Ground beetle: సాధారణంగా కీటకాల్లో ఎన్నో జాతులుంటాయి. అందులో కొన్ని విషకీటకాలు కూడా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కీటకం గురించి వింటే నోరెళ్లబెడతారు.

Knowledge: వామ్మో! ఈ కీటకం చాలా డేంజర్‌ గురూ.. దగ్గరికెళ్లారో అంతే సంగతులు..
Ground Beetle
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 10, 2022 | 8:32 AM

Ground Beetle: సాధారణంగా కీటకాల్లో ఎన్నో జాతులుంటాయి. అందులో కొన్ని విషకీటకాలు కూడా ఉంటాయి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కీటకం గురించి వింటే నోరెళ్లబెడతారు. ఎందుకంటే ఈ కీటకంపై ఎవరైనా దాడి చేయాలని చూస్తే బాంబులేస్తుంది. ఫలితంగా మరే ఇతర జీవి దీన్ని వేటాడ‌డానికి సాహసించదు. దాని పేరే గ్రౌండ్‌ బీటిల్‌. ఇతర జీవుల దాడుల నుంచి తప్పించుకునేందుకు దీనికి ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది. అందుకే దీనికి బాంబార్డియర్ బీటిల్ అని పిలుస్తుంటారు. అంటార్కిటికా మిన‌హా భూమిపై ఉన్న అన్ని ఖండాల్లోనూ ఈ కీట‌కానికి సంబంధించి 500 జాతులున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరి ఈ కీటకం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

ఈ కీటకం శ‌రీరంపై పెంకులాంటి నిర్మాణం ఉంటుంది. ఏవైనా జీవులు దాడిచేసేందుకు వ‌చ్చిన‌ప్పుడు ఇది అన్ని కీటకాల్లాగా వెంటనే గాల్లోకి ఎగర‌లేదు. త‌న‌ను తాను ర‌క్షించేందుకు ర‌సాయ‌న బాంబుల‌ను వ‌దులుతుంది. వీటికారణంగా మరే ఇతర జీవి దీన్ని వేటాడ‌డానికి సాహసించదు. ఈ కీటకం కడుపులోనే విష‌పూరిత వాయువులుంటాయట. శరీరంలో ఉండే రెండు వేర్వేరు గ్రంథుల‌నుంచి ఆక్సిజ‌న్‌, హైడ్రోక్వినోన్ అనే వాయువులు విడుద‌ల‌వుతాయి. ఇవి రెండూ క‌లిసి అతి ప్రమాదకరమైన బెంజోక్వినోన్‌గా మారుతుంది. ఈ డేంజరస్‌ బీటిల్‌ ఒకేసారి 20 సార్లు రసాయనిక వాయువులను విడుద‌ల చేస్తుంది. అవి వాతావరణంలోని ఉష్ణోగ్రతతో కలిసిపోయి బాంబుల్లాగా పాప్ అనే శ‌బ్ధం చేస్తూ విడుదలవుతాయి. ఇది ఇత‌ర జీవుల‌కు చికాకు తెప్పించడంతో పాటు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఈ కీటకంపై దాడి చేసేందుకు ఇతర జీవులు వెనక్కు జంకుతాయి.

Also Read: Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..

Lic Policy: ఎల్‌ఐసీ సూపర్ ప్లాన్.. ప్రతిరోజు రూ.73 డిపాజిట్ చేస్తే.. 10 లక్షలు మీవే..!

AP Crime: ప్రేమించిన యువతి ఫోన్ ఎత్తట్లేదని.. ప్రియుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?