Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..
Railway Recruitment 2022: మీరు రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అలాంటి ఉద్యోగార్ధులకు ఇది నిజంగా శుభవార్త. రైల్వే శాఖ ముంబై డివిజన్‌లోని..
Railway Recruitment 2022: మీరు రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అలాంటి ఉద్యోగార్ధులకు ఇది నిజంగా శుభవార్త. రైల్వే శాఖ ముంబై డివిజన్‌లోని వాన్సాద్‌లో ఉన్న రైల్వే ( రైల్వే రిక్రూట్‌మెంట్ 2022 ) సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులందరూ చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం.. గణితం, సైన్స్, సంస్కృతం, సోషల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి సబ్జెక్టులకు టీజీటీ, కంప్యూటర్ సైన్స్, అసిస్టెంట్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 11 పోస్టులను భర్తీ చేస్తారు.
ఈ 11 పోస్టుల్లో 4 అసిస్టెంట్ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 12 ఏప్రిల్, 2022న జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఈ పోస్టులను పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు తమ అర్హతకు సంబంధించి ద్రువీకరణ పత్రాలన్నింటినీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉదయం 9:00 గంటలకు ప్రిన్సిపాల్, రైల్వే సెకండరీ స్కూల్, వల్సాద్ (వెస్ట్ యార్డ్ రైల్వే కాలనీ) ముంబైలో నిర్వహించబడుతుంది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంబంధిత నోటిఫికేషన్‌ను చేక్ చేసుకోవచ్చు.(ఈ లింక్‌పై క్లిక్ చేయండి)
అర్హతలు.. TGT పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం సంబంధిత సబ్జెక్టులలో B.Ed ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రైమరీ టీచర్ పోస్టులకు 12వ తరగతి, BTC అర్హత సాధించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా.. సీటెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పోస్టులపై ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ.26250 గా ఉంటుంది. అసిస్టెంట్ టీచర్ పోస్టులకు నెలకు రూ. 21,250 జీతం ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Also read:
Vastu Tips: వాస్తు ప్రకారం ఈ దిశలో డబ్బులు అస్సలు పెట్టొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!
Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!
Viral News: బాబోయ్ దెయ్యం.. ఫోన్ నుంచి మెసేజ్‌లు పంపుతోంది.. పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి..!