AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIT Delhi Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

NIT Delhi Recruitment: దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NIT Delhi Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Nit Delhi
Narender Vaitla
|

Updated on: Apr 10, 2022 | 6:34 AM

Share

NIT Delhi Recruitment: దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (10), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌–1) (06), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(గ్రేడ్‌–2) (09) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా టీచింగ్, రీసెర్చ్‌ విభాగాల్లో అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తొలుత ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకొని అనంతరం అప్లికేషన్‌ ఫామ్‌తో పాటు సంబంధిత డ్యాక్యుమెంట్లను జత చేసి ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాలి.

* హార్డ్‌ కాపీలను డైరెక్టర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌), జీటీ కర్నాల్‌ రోడ్, ఢిల్లీ–110036 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత పని ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులు 29-04-2022తో ముగియనుండగా, హార్డ్‌కాపీలను పంపడానికి 09-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Lord Murugan Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాం.. ఇక తమిళనాడులో చూడొచ్చు..!

TSRTC: రామభక్తులకు శుభవార్త.. భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజు ఈ చర్యలు పాటించండి.. జీవితంలోని అన్ని సమస్యలకి పరిష్కారం..!