Lord Murugan Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాం.. ఇక తమిళనాడులో చూడొచ్చు..!

Lord Murugan Statue: తమిళనాడులోని సేలం జిల్లా పుత్తిరగౌండంపళయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Lord Murugan Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాం.. ఇక తమిళనాడులో చూడొచ్చు..!
Murugan
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 09, 2022 | 10:06 PM

Lord Murugan Statue: తమిళనాడులోని సేలం జిల్లా పుత్తిరగౌండంపళయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 146 అడుగుల ఎత్తైన ఈ విగ్రహానికి కుంభాభిషేకం నిర్వహించేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. పుత్తిరగౌండనపాళ్యం ట్రస్ట్ నిర్మించిన ఈ విగ్రహం.. మలేషియాలోని 140 అడుగుల ఎత్తు గల పట్టుమలై మురుగన్ విగ్రహం కంటే ఎత్తైనది. కాగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని సేలంలో ఆవిష్కరించిన సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పుష్ఫాభిషేకం చేశారు. ఇక ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

మలేషియాలోని మురుగన్ విగ్రహం.. సేలంలోని మురుగన్ విగ్రహం నిర్మాణానికి ప్రేరణనిచ్చిందని ముత్తుమలై మురుగన్ ట్రస్ట్ చైర్మన్ ఎన్. శ్రీధర్ చెబుతున్నారు. శ్రీధర్ తన స్వగ్రామమైన అత్తూరులో అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని నిర్మించాలనుకున్నాడు. అందరూ మలేషియా వెళ్లి అక్కడ దేవుడిని పూజించలేరు కదా అని సేలంలో మురుగన్ విగ్రహాన్ని నిర్మించాలని భావించారు. ఆ దిశగా 2014లో తొలి అడుగులు వేశారు. వ్యాపారవేత్త అయిన శ్రీధర్.. తన పొలంలోనే ఆలయాన్ని నిర్మించి మురుగన్ విగ్రహా నిర్మాణానికి పూనుకున్నారు. రెండేళ్ల క్రితం విగ్రహ నిర్మాణానికి తిరువారూర్ త్యాగరాజన్ అనే శిల్పిని సంప్రదించాడు. ఆయన ఓకే చెప్పడంతో.. నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ శిల్పం రూపుదాల్చింది. కాగా, మలేషియాలో 2006లో మురుగన్ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది.

ఇక మలేషియాలోని మురుగన్ విగ్రహం బటు గుహలలో ఉంది. ఇది భారతదేశం వెలుపల గల అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది మలేషియాలో ఎత్తైన హిందూ దేవత విగ్రహం. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు శిల్పులకు మూడేళ్లు పట్టింది. ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించేందుకు 350 టన్నుల స్టీల్ కడ్డీలు, 300 లీటర్ల లిక్విడ్ బంగారం ఉపయోగించారు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు భారతదేశం నుంచి 15 మంది శిల్పులు ప్రత్యేకంగా మలేషియాకు వెళ్లారు. ఇది పూర్తిగా కాంక్రీట్ విగ్రహం.

Also read:

Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ దిశలో డబ్బులు అస్సలు పెట్టొద్దు.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..!

Viral Video: బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్‌.. సీన్ కట్ చేస్తే.. మీరే ఓ లుక్కేయండి..!