Weekly Horoscope: ఈ వారంలో ఈరాశి వారు చేపట్టిందల్లా బంగారమే.. ఈరోజు నుంచి 16వ తేదీవరకూ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Weekly Horoscope: ఈరోజు ఆదివారం.. ఎక్కువ మంది ఈ వారంలో ఎలా ఉంటుంది.. ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా

Weekly Horoscope: ఈ వారంలో ఈరాశి వారు చేపట్టిందల్లా బంగారమే.. ఈరోజు నుంచి 16వ తేదీవరకూ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Weekly Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Apr 10, 2022 | 6:52 AM

Weekly Horoscope: ఈరోజు ఆదివారం.. ఎక్కువ మంది ఈ వారంలో ఎలా ఉంటుంది.. ఏ పని మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమపై గ్రహ ప్రభావం ఎలా ఉంది అంటూ తమ జాతకాలను నామ నక్షత్ర ప్రకారం, లేక జన్మ నక్షత్ర ప్రకారం వారఫలాలను(Weekly Horoscope) చూస్తారు.. వాటి ఆధారంగా తాము చేపట్టిన పనులను సక్రమంగా అడ్డకుంలు లేకుండా జరుగుతాయో లేదో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. రాశి ఫలాల (Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10వ తేదీ ఆదివారం నుంచి ఏప్రిల్ 16 వ తేదీ(శనివారం) వరకూ ఈ వారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.  మానసికంగా బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనులు నెరవేర్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార రంగంలో అనుకున్న ఫలితాలను పొందుతారు. సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి.

వృషభ రాశి: ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగం రంగాల్లో వారు ఆర్ధిక నష్టాలను ఎదుర్కొంటారు.  ఆస్థి విషయంలో స్పష్టత లభిస్తుంది.  వివాదాలకు దూరంగా మౌనంగా పనిచేసుకోవడం ఉత్తమం. వారాంతంలో శాంతి లభిస్తుంది.

మిధున రాశి: ఈ రాశివారు శుభఫలితాలను అందుకుంటారు. కుటుంబానికి సంబంధించిన శుభవార్త వింటారు.  అదృష్టయోగముంటుంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఈ వారం ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. కొంతమంది లాభాలను అందుకుంటారు. ఏదీ తెగే వరకూ లాగవద్దు.  మీ కృషి ఫలించి అనుకున్నది సాధిస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈ వారంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వ్యయాన్ని అదుపు చేయాలి. అధిక శ్రమకు గురవుతారు. వారం మధ్యంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలను పొందుతారు.

సింహ రాశి: ఈ రాశివారికి గ్రహ బలం విశేషంగా ఉంటుంది. పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్ధికంగా ప్రతికూల పరిస్థితులుంటాయి. వారం మధ్యలో శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  పోయిన వాటిని తిరిగి పొందుతారు.

కన్య రాశి: ఈ రాశివారు విజయం కోసం అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఈర్షాపారులనుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రారంభించిన పనుల్లో ఫలితాలను అందుకోవడానికి ఆటంకాలు ఎదుర్కొంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఒక ఆపద నుండి బయటపడతారు. వివాదాస్పద పనులకు దూరంగా ఉండడం మేలు చేస్తుంది.

తుల రాశి: ఈ రాశివారికి అనుకూల సమయం ఈ వారం. శుభఫలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోవారు మంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. కుటుంబ విషయంలో సంతోషముగా ఉంటారు. సమస్యలను అధిగమిస్తారు. అన్నివిధాలా అదృష్ట యోగం ఉంది. సమస్యలు తొలగుతాయి. సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి: ఈరాశివారు ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగంలోని వారు లాభాల బాట పడతారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. తోటివారి సహకారంతో పనులు చేస్తారు. ప్రణాళికతో ముందుకు సాగితే.. ఉత్తమ ఫలితం అందుకుంటారు.

ధనస్సు రాశి: ఈ రాశివారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో  చేపట్టిన పనుల విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఏకాగ్రత అవసరం. గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. కీలక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారాన్ని అందుకుంటారు. మనసులోని కోరికలు నెరవేరతాయి. న్యాయం లభిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది.

మకర రాశి: ఈ రాశివారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలా సహకారం లభిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది.  స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

కుంభ రాశి: ఈ రాశివారికి ఈ వారం ఆర్ధికంగా బాగుంటుంది. ఆ వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు ఆలోచించి సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారంతో శుభఫలితాలను అందుకుంటారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయాలి.

మీన రాశి: ఈ రాశివారు అభివృద్ధికి ఆర్ధిక స్థితికి అనుకూలం. కాలాన్ని వినియోగించుకుంటూ వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలోని వారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తుల సలహాలు సూచనలతో ముందుకు సాగండి. ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలను సొంతం చేసుకుంటారు. బలం పెంచుకుంటారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రేసులో భారతీయుడు.. ముందస్తు సర్వేలు ఏం చెబుతున్నాయి.. ఇంతకీ ఎవరితను?