Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజు ఈ చర్యలు పాటించండి.. జీవితంలోని అన్ని సమస్యలకి పరిష్కారం..!

Hanuman Jayanti 2022: ఈ సంవత్సరం ఏప్రిల్16న హనుమాన్ జయంతి వస్తుంది. వాస్తవానికి చాలామంది మంగళవారం రోజున హనుమంతుడిని ఆరాధిస్తారు. అయితే హనుమాన్‌

Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజు ఈ చర్యలు పాటించండి.. జీవితంలోని అన్ని సమస్యలకి పరిష్కారం..!
Hanuman Jayanti 2022
Follow us
uppula Raju

|

Updated on: Apr 09, 2022 | 8:27 PM

Hanuman Jayanti 2022: ఈ సంవత్సరం ఏప్రిల్16న హనుమాన్ జయంతి వస్తుంది. వాస్తవానికి చాలామంది మంగళవారం రోజున హనుమంతుడిని ఆరాధిస్తారు. అయితే హనుమాన్‌ జయంతి రోజున చేసే పూజకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం చేస్తూ భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ని ఆరాధిస్తారు. హనుమాన్ జయంతి రోజు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మీ ఇంటి కష్టాలను తొలగించుకోవచ్చు. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

1. మీరు డబ్బు సమస్యలని ఎదుర్కొంటున్నట్లయితే హనుమాన్‌ని ఆరాధించండి. చిటికెడు సింధూరం నెయ్యిలో నానబెట్టి పేస్ట్‌లా తయారు చేసి కాగితంపై స్వస్తిక్‌ గుర్తును తయారు చేయండి. ఈ స్వస్తిక్‌ని హనుమాన్‌ హృదయంపై ఉంచండి. హనుమాన్ జయంతి రోజు చేసే ఈ పరిహారం డబ్బు లోటును పోగొడుతుంది.

2. వివాహం కావడంలో ఆలస్యం జరిగితే అమ్మాయిలు, అబ్బాయిలు చిటికెడు సింధూరం తీసుకొని హనుమాన్ పాదాల వద్ద ఉంచండి. హనుమాన్ జయంతి రోజు చేసే ఈ పరిహారం వల్ల తొందరగా వివాహం అవకాశాలను కలిగిస్తుంది.

3. ఇంట్లో నెగిటివ్‌ శక్తి ఉందని అనిపిస్తే తొలగించడానికి సింధూరం నివారణను పాటించండి. పచ్చిమిర్చి తీసుకుని అందులో ఆవాలనూనె కలిపి పేస్టులా చేయాలి. దానిని హనుమాన్ దగ్గర పెట్టి కొద్దిసేపటి తర్వాత ఆ పేస్ట్‌ని అన్ని గదుల గేటు దగ్గర పెట్టాలి. అంతా శుభం జరుగుతుంది.

4. ఉద్యోగంలో ప్రమోషన్ పొందడంలో సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే సింధూరం నివారణను పాటించండి. మల్లె నూనెలో సింధూరం కలిపి కాగితంపై స్వస్తిక్‌ చేయండి. ఈ స్వస్తిక్‌ని హనుమాన్ జీకి సమర్పించిన తర్వాత దానిని జేబులో లేదా పర్సులో పెట్టుకోండి. మంచి జరుగుతుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పురాణాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని గమనించి రాయడం జరిగింది.

Meat: మాంసం అతిగా తింటే ఇబ్బందే.. ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది..!

Onions Benefits: వేసవిలో పచ్చిఉల్లితో అనేక లాభాలు.. ఘాటుగా తింటే ఆ సమస్య పరిష్కారం..!

Sri Ram Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు..!