AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lic Policy: ఈ పథకంలో పెట్టుబడి మెచ్యూరిటీ పై లక్షలు ఇస్తుంది.. వివరాలు మీకోసం..

Lic Policy: మీరు LICలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ పాలసీ మంచి లాభాలని అందిస్తుంది. ఇందులో రోజుకి రూ. 73 డిపాజిట్ చేయడం ద్వారా చివరకి 10 లక్షల

Lic Policy: ఈ పథకంలో పెట్టుబడి మెచ్యూరిటీ పై లక్షలు ఇస్తుంది.. వివరాలు మీకోసం..
Money Earning
uppula Raju
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 09, 2022 | 10:31 PM

Share

Lic Policy: మీరు LICలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ పాలసీ మంచి లాభాలని అందిస్తుంది. ఇందులో రోజుకి రూ. 73 డిపాజిట్ చేయడం ద్వారా చివరకి 10 లక్షల రూపాయలు పొందుతారు. ఈ పాలసీ పేరు న్యూ జీవన్ ఆనంద్ పాలసీ. ఇందులో మెచ్యూరిటీపై 10 లక్షల రూపాయలు లభిస్తాయి. అంతేకాకుండా లైఫ్‌టైమ్ డెత్ కవర్ పొందుతారు. రూ.10 లక్షల కార్పస్ చేయడానికి ప్రతిరోజూ రూ.73 పెట్టుబడి పెట్టాలి.

పాలసీ ప్రత్యేకతలు

1. మీ వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.

2. 50 ఏళ్ల లోపు వారు ఈ పాలసీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

3. ఇందులో గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75 సంవత్సరాలు.

4. ఇది కాకుండా కనీస పాలసీ వ్యవధి 15 సంవత్సరాలు.

5. గరిష్ట పాలసీ వ్యవధి 35 సంవత్సరాలు.

6. ఇందులో మీరు వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక, నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు.

7. హామీ మొత్తం గరిష్ట పరిమితి లేదు.

8. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ ఒక లక్ష రూపాయలు.

9. LIC ఈ పాలసీలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం లభిస్తుంది. మెచ్యూరిటీ లేదా మరణం సమయంలో అందుకున్న మొత్తంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

10 లక్షల రూపాయలు ఎలా పొందాలి?

మీరు ఈ పాలసీని 24 సంవత్సరాల వయస్సులో రూ. 5 లక్షల బీమాతో కొనుగోలు చేస్తే సంవత్సరానికి దాదాపు రూ. 26815 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు దాదాపు రూ.73.50 అవుతుంది. మీరు 21 సంవత్సరాల పాటు పాలసీని తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు మీ మొత్తం పెట్టుబడి దాదాపు 5.63 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో బోనస్‌తో పాటు రూ.10 లక్షల కంటే ఎక్కువ పొందుతారు.

మెచ్యూరిటీపై రూ.10 లక్షలు

సమ్ అష్యూర్డ్ + సింపుల్ రివర్షనరీ బోనస్ + అదనపు బోనస్ 5 లక్షలు + 5.04 లక్షలు + 10 వేలు = 10.14 లక్షలు 21 సంవత్సరాలు పూర్తయితే పాలసీదారు జీవించి ఉంటే అప్పుడు అతను 10 లక్షల కంటే ఎక్కువ పొందుతారు.

గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజు ఈ చర్యలు పాటించండి.. జీవితంలోని అన్ని సమస్యలకి పరిష్కారం..!

Meat: మాంసం అతిగా తింటే ఇబ్బందే.. ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది..!

Sri Ram Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు..!