AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon: పుచ్చకాయ కట్‌ చేయకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?

Watermelon: పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో శరీరంలో వేడిని తగ్గించి చలవ చేసే గుణం ఉంటుంది. ఎండా కాలంలో తినడం ఎంతో మేలు. వేసవి తాపాన్ని, దాహాన్ని..

Watermelon: పుచ్చకాయ కట్‌ చేయకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 08, 2022 | 8:06 AM

Share

Watermelon: పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో శరీరంలో వేడిని తగ్గించి చలవ చేసే గుణం ఉంటుంది. ఎండా కాలంలో తినడం ఎంతో మేలు. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ అనే చెప్పాలి. మార్కెట్లో రకరకాల పుచ్చకాయలు అమ్మతున్నారు. పుచ్చకాయను కొనే ముందు జాగ్రత్తగా చూసి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు (Health professionals) సూచిస్తున్నారు. ఎందుకంటే పుచ్చకాయని కోసి చూపిస్తే తప్ప అది లోపల ఎర్రగా ఉందో లేదో తెలియదు. అలాని కోసి చూపిస్తే ఒక దాన్ని మూడు నాలుగు గంటల్లోనే తినేయాలి. ఆలస్యం చేస్తే అది పాడై కుళ్లిపోయే అవకాశం ఉంటుంది కూడా. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ పరిశోధకులు కొన్ని చిట్కాలు తెలియజేస్తున్నారు.

కనీసం రెండు కిలోలు, అంతకంటే ఎక్కువ బరువు ఉండే పుచ్చకాయను ఎంచుకోవాలి. అయితే పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా పర్వాలేదు. పైన చారలు ఉన్నా, లేకపోయినా ఏమి కాదు. పుచ్చకాయ తొడిమ ఎండిపోయినట్లు ఉండాలి. తొడిమ లేకపోతే తొడిమ ఉండే ప్రాంతం గట్టిగా ఎండినట్లు ఉండాలి. అలాగే పుచ్చకాయ గట్టిగా, బరువుగా ఉండాలి. మెత్తగా ఉంటే అది లోపల పాడైనట్లు గుర్తించాలి. అలాగే కొన్ని పుచ్చకాయలపై గోధుమ లేదా పసుపు రంగు మచ్చలుంటాయి. చారలతో సంబంధం లేకుండా ఆ మచ్చలు దాదాపు గుండ్రంగా ఉంటాయి. మచ్చలు ఎంత ఎక్కువా ఉంటే ఆ పుచ్చకాయ లోపల అంత ఎర్రగా ఉంటుందని తెలుసుకోవాలి. ఒక్కో వాటర్‌ మిలన్‌ పై ఒకటే మచ్చ ఉంటుంది. కొన్నింటికి రెండు, మూడు మచ్చలుంటాయి. ఎంత ఎర్రగా ఉంటే అంత ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయపై ఉండే తొడిమ ఎండిందో లేదో చూసుకోవాలి. అప్పుడు కట్‌ చేయకపోయినా లోపల మాత్రం ఎర్రగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కోసిన పుచ్చకాయని ఇంట్లో ఫ్రిడ్జ్‌లో లేదా ఎండ తగలని ప్రదేశంలో ఉంచినా పాడవదు. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుచ్చ కాయను కొనే ముందు ఇలాంటివి గమనిస్తూ తీసుకుంటే మరి మంచిదంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Headache: నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తోందా ?.. ఎందుకు సంకేతమో తెలుసుకోండి..

AC Side Effects: ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా? అయితే జాగ్రత్త.. ఈ అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్‌..