Headache: నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తోందా ?.. ఎందుకు సంకేతమో తెలుసుకోండి..

తలనొప్పి.. చాలా మందిని తీవ్రంగా వేధిస్తోంది. కొందరు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. ప్రతిరోజూ

Headache: నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తోందా ?.. ఎందుకు సంకేతమో తెలుసుకోండి..
Headache
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2022 | 8:47 PM

తలనొప్పి.. చాలా మందిని తీవ్రంగా వేధిస్తోంది. కొందరు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. ప్రతిరోజూ తలనొప్పి సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. కొన్నిసార్లు డీహైడ్రేషన్, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వలన తలనొప్పి వస్తుంది. అలాగే.. ఒత్తిడి.. ఇతర అనారోగ్య సమస్య వలన కూడా తలనొప్పి వస్తుంది. కొందరికీ ఈ ఈ తలనొప్ప నిద్రలేవగానే వస్తుంది. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఈ సమస్య ఎక్కువ రోజులు ఉంటే ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపిస్తుంది.

ఉదయం తలనొప్పి లక్షణాలు.. తలనొప్పి లక్షణాలు ప్రజలందరిలో విభిన్న రకాలుగా ఉంటుంది. మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పి ఒక భాగంలో మాత్రమే వస్తుంది. అలాగే ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. క్లస్టర్ తలనొప్పి ఉన్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ చాలా ఉంటుంది. కొన్నిసార్లు ఈ భావన కళ్ళు చుట్టూ ఉంటుంది. అదే సమయంలో సైనస్ వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. కొన్ని ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి కారణంగా ఈ సమస్య వస్తుంది. ఈ నొప్పి ఎక్కువగా ముక్కు, కళ్ళు, నుదిటిలో వస్తోంది. ఉదయాన్నే వచ్చే తలనొప్పి ఉదయం 4 నుండి 9 గంటల మధ్య వస్తుంది. ఉదయం తలనొప్పి మైగ్రేన్, సైనస్, టెన్షన్ వంటి ఏదైనా కారణాల వల్ల వస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఉదయం తలనొప్పి సమస్య ఉన్నవారు, వారు కూడా నిద్రలేమి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.

తలనొప్పి రావడానికి కారణాలు.. షిఫ్టులలో పనిచేసే వ్యక్తులలో ఉదయం లేవగానే తలనొప్పి వస్తుందని కొన్ని పరిశోధనలలో తెలీంది. ఈ వ్యక్తుల శరీర దినచర్య మారుతూ ఉంటుంది. దినచర్యలో మార్పు కారణంగా, నిద్ర విధానంలో కూడా మార్పు వస్తుంది. దీంతో వీరికి సరైన నిద్ర ఉండదు. ఉదయం నిద్రలేచిన తర్వాత వచ్చే తలనొప్పికి ప్రధాన కారణాలలో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు నిద్రించడానికి ప్రయత్నిస్తారు కానీ వారు నిద్రపోలేరు. ఉదయం లేవగానే తలనొప్పిగా అనిపిస్తుంది. కొంతమందికి సరైన దిండు లభించకపోవడం, నిద్రపోయే సమయం మారడం వంటి కారణాల వల్ల ఉదయం తలనొప్పి కూడా వస్తుంది. డిప్రెషన్, ఆందోళన కారణంగా ఉదయం లేవగానే తలనొప్పి వస్తుంది. ఇది కాకుండా కొన్ని మందులు నిద్రపై ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు శరీరంలో సంభవించే కొన్ని ప్రమాదకరమైన వ్యాధి కారణంగా కూడా తలనొప్పి రావచ్చు.

* సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు .. రోజు రోజుకీ సమస్య మరింత పెరుగుతున్నప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలతోపాటు.. తలనొప్పి వుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – వినికిడి తక్కువ. – మూర్ఛ – అధిక జ్వరం – తిమ్మిరి లేదా బలహీనత – మెడ గట్టిపడటం – చూడటంలో ఇబ్బంది – మాట్లాడటంలో సమస్యలు

తగ్గించడానికి చిట్కాలు. కోల్డ్ ప్యాక్.. నుదుటిపై కోల్డ్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని కోసం ఐస్ క్యూబ్స్ లేదా ఐస్ ప్యాక్ లను టవల్‏లో చుట్టి నుదుటిపై 15 నిమిషాల పాటు ఉంచాలి. హీటింగ్ ప్యాక్- టెన్షన్ తో తలనొప్పి వస్తే.. మెడ, తల వెనుక హీటింగ్ ప్యాక్ పెట్టాలి.. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు. ఒత్తిడిని తగ్గించండి- తలనొప్పి ఉంటే కొంత సమయంపాటు జుట్టును వదిలేయాలి. జుట్టులో ఉన్న క్లిప్స్ అన్ని తీసేసి వదిలేయాలి. ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుందని కొందరు నమ్ముతారు. తేలికపాటి లైట్లు.. చాలా ప్రకాశవంతమైన లైట్లు మైగ్రేన్ సమస్యను మరింత పెంచుతాయి. ఇంట్లో లైట్లు వెలిగించాలి.. బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించాలి. చూయింగ్ గమ్ దవడకు హాని కలిగించడమే కాకుండా తలనొప్పికి కూడా కారణమవుతుంది. చాలా కఠినమైన వస్తువులను నమలడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. తక్కువ మొత్తంలో కెఫీన్ తీసుకోవడం- కొద్ది మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే, అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల మీ సమస్య పెరుగుతుంది. తక్కువ ఆల్కహాల్ తీసుకోవాలి- ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య పెరుగుతుంది. కొంతమందికి మద్యం తాగడం వల్ల క్లస్టర్ తలనొప్పి మరియు ఒత్తిడిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

Also Read: Ramarao On Duty: బుల్ బుల్ తరంగ్ అంటూ రాబోతున్న మాస్ మహారాజా.. రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్..

Rajamouli: ఆమిర్ ఖాన్ మా అగ్రిమెంట్ బ్రేక్ చేశారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి..

RGV: మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. డేంజరస్ సినిమాపై షాకింగ్ నిర్ణయం..

Ram Gopal Varma: వర్మను రాముడితో పోలుస్తూ పద్యం రాసిన రచయిత.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆర్జీవీ..

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన