White Hair: తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే కలర్ వేయకుండా ఈ 3 చిట్కాలను పాటించండి!
గతంలో ఏ 40, 50 ఏళ్లకో తెల్లజుట్టు వచ్చేది. కానీ ఇప్పుడు 15 ఏళ్లకే తెల్ల జుట్టు(White Hair) వస్తుంది. దీనికి ప్రధాన కారణం కాలుష్యం, ఆహారపు అలవాట్లు, అలాగే ఎండలో ఉండకపోవడం...
గతంలో ఏ 40, 50 ఏళ్లకు తెల్లజుట్టు వచ్చేది. కానీ ఇప్పుడు 15 ఏళ్లకే తెల్ల జుట్టు(White Hair) వస్తుంది. దీనికి ప్రధాన కారణం కాలుష్యం, ఆహారపు అలవాట్లు, అలాగే ఎండలో ఉండకపోవడం. దీంతో జుట్టు బలహీనంగా మారడం సహా చిన్న వయసులోనే తెల్ల వెట్రుకలు వస్తున్నాయి. తెల్ల జుట్టు రాగానే చాలా మంది రంగును వేసుకుంటున్నారు. కానీ దీని వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్(Side Effects) గురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్(Cancer) వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఎందుకంటే అందులో వాడే కెమికల్స్ శరీరానికి చాలా ప్రమాదకరం. ఎలాంటి కెమికల్ లేకుండా జుట్టు నల్లగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి.
1.కరివేపాకు
కరివేపాకులో బయో-యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పూర్తి పోషణను అందిస్తాయి. కరివేపా తెల్ల జుట్టు సమస్యను దూరం చేస్తుంది. కరివేపాకు పేస్ట్ లేదా కరివేపాకు వేసిన నూనెను తలకు రాసుకోవడం వల్ల తెల్ల జుట్టు నుంచి ఉపశమనం లభిస్తుంది.
2.నిమ్మకాయ
నిమ్మకాయలో ఉండే మూలకాలు జుట్టును నల్లగా మార్చడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. 15 ml నిమ్మరసం, 20 గ్రాముల జామకాయ పొడిని తీసుకోని.. ఆ రెండింటిని కలిపి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. అలా కొద్ది రోజులు చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశం ఉంటుందట.
3. తులసి
హెయిర్ కేర్ నిపుణులు సలహా ప్రకారం.. తులసి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. దీని ప్రభావం వల్ల తెల్ల జుట్టును నల్లగా మారేందుకు సహయం చేస్తుంది. అయితే జుట్టుకు తులసి ఆకులు ఎలా ఉపయోగపడుతుందో చూడండి.
గమనిక:– ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.
Read Also.. Headache: నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వస్తోందా ?.. ఎందుకు సంకేతమో తెలుసుకోండి..