RBI: ఆ 4 బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా.. కారణం ఏంటంటే..!

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిబంధనలు పాటించని బ్యాంకులకు షాకిస్తోంది. అలాంటి బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది...

RBI: ఆ 4 బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా.. కారణం ఏంటంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 12, 2022 | 8:22 AM

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిబంధనలు పాటించని బ్యాంకులకు షాకిస్తోంది. అలాంటి బ్యాంకులపై భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. ఇప్పటికే ఎన్నో బ్యాంకుల (Banks)పై జరిమానా విధించిన ఆర్బీఐ.. తాజాగా మరో నాలుగు సహకార బ్యాంకు (Co-operative Banks)లపై విధించింది. జరిమానా మొత్తం రూ.4 లక్షలు. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. రెగ్యులేటరీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించనందుకు ఈ సహకార బ్యాంకులపై జరిమానా విధించబడింది. మార్గదర్శకాలను పాటించని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటారు. జరిమానాలతో పాటు ఆంక్షలు కూడా విధిస్తోంది ఆర్బీఐ. అయితే ఈ నాలుగు సహకార బ్యాంకులపై జరిమానా విధించినప్పటికీ, ఖాదారుల లావాదేవీలు, ఖాతాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.

అండర్సుల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ రూ.1.50 లక్షల జరిమానా విధించింది. అలాగే మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నడుస్తున్న మహేశ్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ. లక్ష జరిమానా, అదేవిధంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్న నాందేడ్ మర్చంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ రూ.50,000, మరో సహకార బ్యాంకుతో కలిపి మొత్తం నాలుగు బ్యాంకులకు ఈ జరిమానా విధించింది.

రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, ‘బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎక్స్‌పోజర్ నిబంధనల’ మార్గదర్శకాలను పాటించనందుకు సహకార బ్యాంకులకు జరిమానా విధించబడింది. షాడోల్‌కు చెందిన జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మర్యాడిట్‌పై రూ.లక్ష జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 నిబంధనలను ఉల్లంఘించింది. అలాగే, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్ 2014, KYC సూచనలను అనుసరించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ చర్య తీసుకుంది.

ఈ రెండు బ్యాంకులపైనా చర్యలు

రెండు రోజుల క్రితం నో యువర్ కస్టమర్ (KYC) మార్గదర్శకాలతో సహా అనేక నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్‌పై RBI రూ. 93 లక్షల జరిమానా విధించింది. అలాగే ఐడీబీఐ బ్యాంకుపై ఆర్బీఐ రూ.90 లక్షల జరిమానా విధించింది. యాక్సిస్ బ్యాంక్ కొన్ని సూచనలను పాటించనందుకు రూ.93 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

యాక్సిస్ బ్యాంక్ రుణాలు, KYC మార్గదర్శకాలు, ‘పొదుపు ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించనందుకు జరిమానా ఛార్జీలు విధించింది. వాణిజ్య బ్యాంకులు, సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ల ద్వారా మోసాలను వర్గీకరించడం, నివేదించడం’పై ఆదేశాలను పాటించనందుకు IDBI బ్యాంక్‌కి RBI జరిమానా విధించింది.

ఇవి కూడా చదవండి:

EPFO Update: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీని అప్‌డేట్‌ చేయడం ఎలా..?

Whatsapp: మీ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ యాప్‌కు లాక్‌-అన్‌లాక్‌ చేయడం ఎలా..?

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?