Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..

ఇవాళ సామాన్యులకు ఊరటనిస్తూ ఇంధన ధరలను పెంచలేదు. ఈరోజు కూడా పెట్రోల్-డీజిల్ ధరలో మీకు ఉపశమనం లభించింది. దేశంలోని నగరాల్లో పెట్రోల్..

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 12, 2022 | 8:38 AM

Petrol Diesel Price Today: చమురు కంపెనీలు సోమవారం పెట్రోల్-డీజిల్ ధరను విడుదల చేశాయి. అయితే ఇవాళ సామాన్యులకు ఊరటనిస్తూ ఇంధన ధరలను పెంచలేదు. ఈరోజు కూడా పెట్రోల్-డీజిల్ ధరలో మీకు ఉపశమనం లభించింది. దేశంలోని నగరాల్లో పెట్రోల్.. డీజిల్ రేటు పెరగకపోవడం ఇది వరుసగా ఆరవ రోజు. అంతకుముందు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచుతున్నాయి. మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం. ఈ సమయంలో, మార్చి 24, ఏప్రిల్ 1 నుంచి ధరలో ఎటువంటి మార్పు లేదు. కానీ అప్పటి నుంచి చమురు ధర నిరంతరంగా పెరుగుతోంది. పెరిగిన చమురు ధరలు గత ధర ఐదు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం పెట్రోర్, డీజిల్ ధరలు మీ కోసం..

క్రూడ్ ఆయిల్ ఇవాళ్టి ధర..

గ్లోబల్ ఫ్రంట్‌లో ఈరోజు క్రూడ్ ధర తగ్గింది. ఈ రోజు ముడి చమురు ధరలను పరిశీలిస్తే, నైమాక్స్ క్రూడ్ బ్యారెల్‌కు $ 95.59, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 99.56 వద్ద కొనసాగుతోంది. ఇవాళ Nymax క్రూడ్ బ్యారెల్‌కు $ 1.30 క్షీణతను చూస్తోంది. బ్రెంట్ క్రూడ్ $ 1.08 పతనంతో ట్రేడవుతోంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.105.49గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.22గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.105.65గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 116.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.105.39గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.41గా ఉండగా.. డీజిల్ ధర రూ.106.21గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.99 ఉండగా.. డీజిల్ ధర రూ.105.96గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.18 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.19గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.120ఉండగా.. డీజిల్ ధర రూ. 103.26గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.64లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.103.90గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 121.02గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.45గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.121.60లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.104.70లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.83లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.57కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.104.77 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.115.12 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 97.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.94ఉండగా.. డీజిల్ ధర రూ.100.94గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.09 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.79గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.03 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.61గా ఉంది.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోండి

మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్ , డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు, HPCL (HPCL) వినియోగదారులు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్>ని 9223112222 నంబర్‌కు పంపవచ్చు.

ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..

Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..