Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..
వెహికల్‌పై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు(Traffic challans)డిస్కౌంట్(Discount)తో చెల్లించడానికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు (Telangana Traffic Police) ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చారు. అది మరో మూడు రోజుల్లో ముగియనుంది. రాయితీ వర్తింపు గడువులోగా..
Traffic Challans Concession: తెలంగాణ(Telangana) వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ గుర్తుందా.. పెండింగ్‌లో ఉన్న చలాన్ల(Pending Challans)పై ఇచ్చిన రాయితీ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే మరో 15 రోజుల పాటు పొడిగించినా తేదీని ముగింపుకు చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు(KCR) ఆదేశాల మేరకు పెండింగ్ చలాన్ల గడువు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు గానూ ఇప్పటి వరకు వాహనదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దీంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతోంది. ట్రాఫిక్ చలానాల రాయితీ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 2.40 కోట్లపైగా చలాన్లు చెల్లింపు జరుగుతోంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.
వెహికల్‌పై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు(Traffic challans)డిస్కౌంట్(Discount)తో చెల్లించడానికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు (Telangana Traffic Police) ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చారు. అది మరో మూడు రోజుల్లో ముగియనుంది. రాయితీ వర్తింపు గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోలేకపోతే తర్వాత భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. మీరు ఊళ్లో లేకపోయినా సరే..ఆన్‌లైన్లో అయినా చెల్లించమంటున్నారు. తెలంగాణలో పెండింగ్ చలాన్ల రూపంలో ట్రాఫిక్ పోలీసులకు సుమారు 400కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది.
అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఆ లెక్కలు తేలకపోవడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ( Hyderabad Traffic Police)బకాయి చలాన్లు వసూలు చేసుకునే పేరుతో వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్చి(March)1వ తేది నుంచి మార్చి 31లోగా చలాన్లు క్లియర్ చేసే వాళ్లకు రాయితీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కేవలం 26రోజుల వ్యవధిలో ట్రై కమిషనరేట్‌ల పరిధిలోనే కోటిన్నరకుపైగా చలాన్లు క్లియర్ అయ్యాయి. ఇన్ని చలాన్లకు 150కోట్ల రూపాయలుపైగా ప్రభుత్వ ఖజానాలో జమా అయింది.
ఆలస్యం చేస్తే మీకే మోత..
ట్రాఫిక్ పోలీసుల ప్లాన్ వర్కవుట్ కావడంతో మిగిలిన చలానాలను కూడా మిగిలిన 3 రోజుల్లోనే వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగానే చలానాలను క్లియర్ చేసుకోమని వాహనదారులకు విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత ప్రస్తుతం ఉన్న చలానాలకు రాయితీ ఇవ్వమని పూర్తి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ క్రింద విధముగా వివిధ రకాల వాహన యజమానులకు ఈ క్రింది విధముగా రాయితీని నిర్ణయించారు.
- టూవీలర్ / త్రీవీలర్- కట్టాల్సింది – 25%, మిగతా బ్యాలన్స్ 75% మాఫీ.
- RTC డ్రైవర్స్ కట్టాల్సింది – 30%, మిగతా బ్యాలన్స్ 70% మాఫీ.
- LMV/ HMV – కట్టాల్సింది – 50%, మిగతా బ్యాలవ్స్ 50% మాఫీ.
- తోపుడు బండ్ల వ్యాపారులు కట్టాల్సింది – 20%, మిగతా బ్యాలన్స్ 80% మాఫీ.
- నో మాస్క్ కేసులు- కట్టాల్సింది – Rs.100, మిగతా బ్యాలన్స్ Rs 900 మాఫీ.
బకాయిలు చెల్లింపు కోరిన మోటారు వాహన యజమనులు అన్ని విధముల ఆన్‌లైన్ సేవా చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లింపవచ్చు.
ఇవి కూడా చదవండి: Indian Railway: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు మృతి..
Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..