AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద..

టాలెంటెడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) కారుకు పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా చైతూ కారుకు బ్లాక్ ఫిల్మ్ తొలగించారు..

Naga Chaitanya: హీరో నాగచైతన్య కారుకు జరిమానా విధించిన పోలీసులు.. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2022 | 6:46 AM

Share

టాలెంటెడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) కారుకు పోలీసులు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్ చెక్‏పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా చైతూ కారుకు బ్లాక్ ఫిల్మ్ తొలగించారు… అలాగే రూ. 700 జరిమానా విధించారు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు. ఆ సమయంలో కారులో చైతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల అల్లు అర్జున్, ఎన్టీఆర్, మంచు మనోజ్ కార్లకు జరిమానా విధిస్తూ.. బ్లాక్ ఫిలిం తొలగించారు పోలీసులు. వై కేటగిరి ఉన్న వ్యక్తులు మినహా ఇతర వ్యక్తుల కార్లకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు పాటించని కార్లకు జరిమానా విధిస్తున్నారు పోలీసులు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలో పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ కారుకు బ్లాక్ ఫిలిం ఉండడంతో నిబంధనలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇక చైతూ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో చైతూ సరసన రాశి ఖన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. మరోవైపు ప్రస్తుతం చైతూ డిజిటల్ ఎంట్రీకి కూడా సిద్ధమయ్యాడు.. ధూత అనే వెబ్ సిరీస్‎లో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‏తో ఎన్నో అంచనాల మధ్య ఈ సిరీస్ తెరకెక్కించనున్నారు.

Also Read: RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి కొత్త అప్‌డేట్.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర

యూనిట్..

New Movies In This Week: ఈ వారం థియేటర్‌లో సందడి చేయనున్న సినిమాలు.. ఆ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్..

Bloody Mary: ‘ప్రతి ఒక్కరిలోనూ మ‌న‌కు తెలియ‌ని మ‌రో మ‌నిషి ఉంటాడు’.. ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘బ్లడీ మేరీ’ ట్రైలర్‌..

KGF 2: బాహుబలి 2 రికార్డులను కేజీఎఫ్‌ 2 తిరగరాస్తుందా.? యశ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..