RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి కొత్త అప్‌డేట్.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర యూనిట్..

పాన్ ఇండియా సినిమా అనే మాటకు కరెక్ట్ డెఫినిషన్ ఏమైనా వుందా? దానికుండాల్సిన క్వాలిటీలు, క్వాలిఫికేషన్లు ఏంటి.. అనేది నిన్నటిదాకా ఒక అంతుబట్టని ప్రశ్న...

RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి కొత్త అప్‌డేట్.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర యూనిట్..
Rrr
Follow us
Srinivas Chekkilla

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 11, 2022 | 7:59 PM

పాన్ ఇండియా సినిమా అనే మాటకు కరెక్ట్ డెఫినిషన్ ఏమైనా వుందా? దానికుండాల్సిన క్వాలిటీలు, క్వాలిఫికేషన్లు ఏంటి.. అనేది నిన్నటిదాకా ఒక అంతుబట్టని ప్రశ్న. బట్.. నో మోర్ కన్‌ఫ్యూజన్ అంటూ కొలీగ్స్‌కి పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు జక్కన్న(S. S. Rajamouli). ఆయనిచ్చిన ఒక ఫార్ములాను ఇప్పుడు మిగతా వారందరూ బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు. పర్‌ఫెక్ట్ సింక్రనైజేషన్‌తో ఇద్దరు హీరోలు కలిసి వేసిన ఆ హుక్ స్టెప్ నాటునాటు పాటను క్రేజీగా మారిస్తే.. ఆ క్రేజీ పాట ట్రిపులార్ సినిమాకు మెయిన్ డ్రైవింగ్‌ఫోర్స్‌గా పనిచేసి.. సినిమా లవర్స్ అందరినీ ఫాలోయర్లుగా మార్చేసుకుంది. ట్రిపులార్‌(RRR)లో మిగతా కమర్షియల్ ఎలిమెంట్స్‌ అన్నీ ఒక ఎత్తయితే.. తారక్(NTR) అండ్ చెర్రీ డ్యాన్సింగ్ టాలెంట్ ఒక్కటీ ఒక ఎత్తనేది నేషనల్ టాక్.

స్వతహాగానే సౌతిండియన్ స్టార్స్ అంటే మంచి డ్యాన్సర్స్ అనే పేరుంది. తెలుగు హీరోలైతే ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేశారు. నాటునాటు పాట ఆ స్టేట్‌మెంట్‌ని ఇంకాస్త సాలిడ్‌గా మార్చేసింది. ఈ పాటకు సంబంధించి ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సోమవారం సాయంత్రం నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. అటు కలెక్షన్ల పరంగా RRR దూసుకెళ్తోంది. ఇప్పటికే బాహుబలి రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా.. జక్కన్న చేసిన విజువల్ వండర్ కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ఫిదా అయ్యారు. ఈ సినిమాకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. ఇద్దరు పెద్ద హీరోలను కలిపి ఒకే స్క్రీన్ పైన చూపించి మ్యాజిక్ చేశారు రాజమౌళి. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా పోటాపోటీగా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ పాన్ ఇండియా బ్లక్ బస్టర్ మూవీ. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పటికి క్యూ కడుతున్న ఆడియన్స్.

ట్రిపులార్‌(RRR) ఫస్ట్ వీకెండ్‌ గ్రాస్ 500 కోట్లు క్రాసైనట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇండియన్ సినిమా గ్లోరీని దర్శకధీరుడు మళ్లీ తీసుకొచ్చారని, బిగ్‌ స్క్రీన్స్‌ ఇక సంక్షోభం నుంచి బైటపడ్డట్టేనని భరోసానిచ్చింది ట్రిపులార్ సినిమా. ఇది చాలదంటూ వెయ్యి కోట్ల మైల్‌స్టోన్‌ కూడా రీచ్ అయ్యింది ఇప్పుడు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల మార్క్ ను చేరుకుందని చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. హాలిడేస్ లేని సీజన్‌లో రిలీజైనప్పటికీ, జక్కన్న మ్యాజిక్ మీదున్న మోజుతో థియేటర్స్‌కి క్యూ కడుతోంది ప్రేక్షకజనం. ఓవర్సీస్‌లో అయితే తొక్కుకుంటూ పోతూనే వుందీ భారీ సినిమా. ఫస్ట్ వీకెండ్‌ వసూళ్లతోనే 9 మిలియన్ డాలర్ల మార్క్‌ని దాటి…సెకండ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ మధ్య వచ్చిన హాలీవుడ్ మూవీస్‌ని కూడా క్రాస్ చేసింది జక్కన్న ఆర్ఆర్ఆర్.

Read Also..  Bloody Mary: ‘ప్రతి ఒక్కరిలోనూ మ‌న‌కు తెలియ‌ని మ‌రో మ‌నిషి ఉంటాడు’.. ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘బ్లడీ మేరీ’ ట్రైలర్‌..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!