AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: కార్తికేయ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. నిఖిల్ సినిమా వచ్చేది ఎప్పుడంటే..

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ (Nikhil) ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 18 పేజేస్, కార్తికేయ 2 సినిమాల్లో నటిస్తున్నాడు.

Karthikeya 2: కార్తికేయ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. నిఖిల్ సినిమా వచ్చేది ఎప్పుడంటే..
Nikhil
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2022 | 6:28 AM

Share

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ (Nikhil) ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 18 పేజేస్, కార్తికేయ 2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా కార్తికేయ 2 (Karthikeya 2). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. . ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ సినిమా జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కార్తికేయ‌ 2 షూటింగ్ మొద‌ల‌య్యిన ద‌గ్గ‌ర‌ నుంచి సామాన్య ప్రేక్ష‌కుల్లో, సినిమా ప్ర‌ముఖుల్లో ఆసక్తి నెల‌కొంది. తాజాగా విడుదల చేసిన పోస్ట‌ర్ లో ఇంట్ర‌స్టింగ్ థింగ్ ఏంటంటే డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్టుడి చ‌రిత్రకి సంబంధించిన ద్వారక, ద్వాప‌ర యుగంలో జ‌రిగింది. ఇప్ప‌టికి ఆ లింక్ లో కార్తికేయ‌ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్ర‌యాణం. శ్రీ కృష్ణుడు ఆయ‌న‌కి సంబందించిన క‌థలో డాక్ట‌ర్ కార్తికేయ అన్వేష‌ణగా శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నాడు. ఈ చిత్రంలోని భావాన్ని ఈ పోస్ట‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. గతంలో కార్తికేయ, స్వాతి జంటగా వచ్చిన కార్తికేయ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: RRR Movie: ఆర్‌ఆర్ఆర్ నుంచి కొత్త అప్‌డేట్.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర

యూనిట్..

New Movies In This Week: ఈ వారం థియేటర్‌లో సందడి చేయనున్న సినిమాలు.. ఆ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్..

Bloody Mary: ‘ప్రతి ఒక్కరిలోనూ మ‌న‌కు తెలియ‌ని మ‌రో మ‌నిషి ఉంటాడు’.. ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘బ్లడీ మేరీ’ ట్రైలర్‌..

KGF 2: బాహుబలి 2 రికార్డులను కేజీఎఫ్‌ 2 తిరగరాస్తుందా.? యశ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే