Indian Railway: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు మృతి..
Indian Railway: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొ ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు.
Indian Railway: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైలు ఢీకొ ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జి సిగడాం సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నెంబర్ 12513)లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు చైన్ లాగి పక్క ట్రాక్ పైకి దిగారు. అదే సమయంలో విశాఖ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. దాంతో ఐదుగురు ప్రయాణికులు స్పాట్‌లోనే చనిపోయారు. వారి మృతదేమాలు చెల్లాచెదురు అయ్యారు. ఈ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, స్టాప్ లేకుండానే చైన్ లాగి దిగే క్రమంలో ప్రయాణికులు మృత్యువాత పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మృతుల వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు.
Also read:
Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..
విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..