Viral Photo: మనిషి అన్నాక కాస్త కళా పోషణ ఉండాలి ఇది ఓ సినిమాలో రావు గోపాలరావు చెప్పే డైలాగ్. మనం ఏ వృత్తిలో ఉన్న మనకు ఓ ప్రత్యేక ప్రవృత్తి ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు మనకు నచ్చిన పని చేసే ఉంటాం. కెరీర్ పరంగా ఉద్యోగం చేస్తున్నా, ప్యాషన్ కోసం అప్పుడప్పుడు నటించే వారు కొందరైతే, పాటలు పాడే వారు మరికొందరు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ టాప్ రాజకీయ నాయకుడు ఒకప్పుడు సినిమాల్లో నటించారనే విషయం మీకు తెలుసా.? ప్రస్తుతం ఆ పొలిటిషియన్‌కు చెందిన ఒకప్పటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత. వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా జల వనరుల శాఖ మంత్రిగా పదవి అధిరోహించారు. ప్రతిపక్షాలను చీల్చి చెండాడడంలో తనకు తనే సాటి. ఇంతకీ ఈ నాయకుడు మరెవరో కాదు ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబే. ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అంబటికి సినీ ఇండస్ట్రీతోనూ పరిచయాలు ఉన్నాయి.
తాజాగా అంబటి సినీ కెరీర్ నాటి కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఏ సినిమా షూటింగ్ అని తెలియకపోయిన్పటికీ వైరల్ అవుతోన్న ఫోటోలు చూస్తుంటే మాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించినట్లు కనిపిస్తోంది.
Also Read: Oil Demand: మార్చిలో భారీగా అమ్ముడైన పెట్రోలు-డీజిల్.. కారణం అదే..
Pawan Kalyan: అన్నదాతకు అండగా పవన్ కళ్యాణ్.. అనంతపురం జిల్లాలో పర్యటించనున్న జనసేనాని
హోరెత్తిస్తున్న యామిని భాస్కర్ అందాలు