Oil Demand: మార్చిలో భారీగా అమ్ముడైన పెట్రోలు-డీజిల్.. కారణం అదే..
Oil Demand: దేశంలో ఇంధన డిమాండ్ మార్చి నెలలో ఏకంగా మూడేళ్ల గరిష్ఠానికి(Peak Demand) చేరుకుంది. ఇంత భారీ స్థాయిలో పెట్రోడీజిల్ వినియోగం పెరగటానికి ప్రధాన కారణం అదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Oil Demand: దేశంలో ఇంధన డిమాండ్ మార్చి నెలలో ఏకంగా మూడేళ్ల గరిష్ఠానికి(Peak Demand) చేరుకుంది. ఏప్రిల్ 9 నాటికి చమురు మంత్రిత్వ శాఖ(Petroleum Ministery) పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. ఇంధన డిమాండ్ గత సంవత్సరం ఇదే నెల సమయంలో ఉన్న 18.62 మిలియన్ టన్నుల నుంచి 4.2% పెరిగి 19.41 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది మార్చి 2019 నుంచి వినియోగంలో అత్యధికం. మార్చి 2019లో ఇంధన వినియోగం 19.56 మిలియన్ టన్నులుగా ఉంది.
ఆల్ టైమ్ హైకి అమ్మకాలు..
దేశంలో పెట్రోలు అమ్మకాలు ఆల్ టైమ్ హైకి చేరాయి. డేటా ప్రకారం.. మార్చి 2021లో 2.74 మిలియన్ టన్నులుగా ఉన్న పెట్రోలు వినియోగం.. మార్చి 2022 నాటికి 2.91 మిలియన్ టన్నులకు పెరిగింది. డీజిల్ గురించి చెప్పాలంటే.. మార్చి 2021లో 7.22 మిలియన్ టన్నులుగా ఉన్న వినియోగం.. ప్రస్తుతం మార్చి 2022 నాటికి 7.70 మిలియన్ టన్నులకు పెరిగింది.
ధరల పెంపు కారణంగా డిమాండ్..
ఇంధనానికి డిమాండ్ పెరగడానికి ధర పెంపు అవకాశం ఉండటం కారణమని UBS విశ్లేషకుడు గియోవన్నీ స్టానోవో పేర్కొన్నారు. ధరలు పెరిగే అవకాశం ఉందని భావించి చాలా మంది మార్చిలో ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేశారని అన్నారు. రాబోయే నెలల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, చమురు డిమాండ్ మరింత మెరుగుపడేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు.
రష్యా నుంచి ముడి చమురు..
దేశ అవసరాల్లో 85% కంటే ఎక్కువ ముడి చమురు సరఫరా కోసం భారత్ ఇతర దేశాలపైనే అధికంగా ఆధారపడి ఉంది. చౌకగా ముడి చమురును కొనుగోలు చేసేందుకు భారత్ ఇప్పుడు రష్యా వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం కూడా ఇదే. ప్రస్తుతం రష్యా నుంచి భారత్ భారీ తగ్గింపుతో చమురును దిగుమతి చేసుకుంటోంది. భారతీయ రిఫైనర్లు మే లోడింగ్ కోసం కనీసం 16 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి డిస్కౌంట్లో కొనుగోలు చేశాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇవీ చదవండి..
Bank Alert: ఆ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా వడ్డీ రేట్లు తగ్గింపు..
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 2.65 శాతం పడిపోయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్..