AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Alert: ఆ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా వడ్డీ రేట్లు తగ్గింపు..

Bank Alert: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకు వడ్డీ రేట్ల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా చాలా ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుండగా ఈ బ్యాంక్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Bank Alert: ఆ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా వడ్డీ రేట్లు తగ్గింపు..
Banks
Ayyappa Mamidi
|

Updated on: Apr 11, 2022 | 4:16 PM

Share

Bank Alert: ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు వడ్డీ రేట్ల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా చాలా ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటిస్తున్న తరుణంలో ఐఓబీ మాత్రం తమ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. ఏడాది కంటే తక్కువ వ్యవధితో పాటు రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్ల మేర తగ్గించాలని నిర్ణయించింది. ఈ తగ్గించిన వడ్డీ రేట్లు ఈ రోజు నుంచి (ఏప్రిల్ 11, 2022) నుంచి అమల్లోకి వచ్చాయి.

7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇకపై 3 శాతం వడ్డీ రేటునే ఆఫర్ చేయనుంది. ఈ వడ్డీ రేటు ప్రస్తుతం 3.4 శాతంగా ఉంది. అలాగే 30 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధి ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటు 3 శాతంగా నిర్ణయించింది. 121 రోజుల నుంచి 179 రోజులలో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై బ్యాంకు 4 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనుంది. 270 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది.

వడ్డీ రేట్లలో మార్పు తరువాత వివిధ కాలపరిమితులకు వర్తించే కొత్త రేట్ల వివరాలు..

1. 7 రోజుల నుంచి 14 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు

2.15 రోజుల నుంచి 29 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు

3. 30 రోజుల నుంచి 45 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు

4. 46 రోజుల నుంచి 60 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ రేటు

5. 61 రోజుల నుంచి 90 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీ రేటు

6. 91 రోజుల నుంచి 120 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు

7. 121 రోజుల నుంచి 179 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు

8. 180 రోజుల నుంచి 269 రోజుల వ్యవధి గల డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు

9. 270 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధి గల డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు

10. ఏడాది నుంచి రెండేళ్ల లోపున్న డిపాజిట్లపై 5.15 శాతం

11. రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు వ్యవధి కల డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ

12. మూడేళ్లు, ఆపైబడిన డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ రేటు

ఈ విషయంలో సీనియర్ సిటిజన్లకు మాత్రం కొంత వెసులుబాటు ఉంది. అదేంటంటే.. ఖాతాదారు సీనియర్ సిటిజన్ అయితే పైన వెల్లడించిన వడ్డీ రేట్లకు అదనంగా 0.50 శాతం వడ్డీని అందించనుంది. 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం 0.75 శాతం వడ్డీని అదనంగా అందించాలని బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంక్ అందిస్తున్న టాక్స్ సేవింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.45 శాతంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి..

 Elon Mask: ట్విట్టర్ బోర్డు సభ్యత్వంలో ట్విస్ట్ ఇచ్చిన ఎలాన్ మస్క్.. వెల్లడించిన సీఈవో..

Startup Companies: స్టార్టప్స్‌లోకి పెట్టుబడుల వెల్లువ.. మూడు నెలల్లోనే ఎన్ని కోట్లు వచ్చాయంటే..