Startup Companies: స్టార్టప్స్‌లోకి పెట్టుబడుల వెల్లువ.. మూడు నెలల్లోనే ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Startup Companies: దేశీయ స్టార్టప్‌ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. 2022 మార్చితో ముగిసిన మెుదటి క్వార్టర్ లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

Startup Companies: స్టార్టప్స్‌లోకి పెట్టుబడుల వెల్లువ.. మూడు నెలల్లోనే ఎన్ని కోట్లు వచ్చాయంటే..
Startup
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 11, 2022 | 3:22 PM

Startup Companies: దేశీయ స్టార్టప్‌ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. 2022 మార్చితో ముగిసిన మెుదటి క్వార్టర్ లో కొత్తగా రూ.81,540 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పీడబ్ల్యుసీ ఇండియా నివేదిక చెబుతోంది. ఇందులో 89 శాతం పెట్టుబడులను ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌ కంపెనీల్లోకి ఇన్వెస్ట్ మెంట్ గా వచ్చాయి. ఇదే సమయంలో మరో 14 స్టార్టప్‌ కంపెనీలు విలువపరంగా వంద కోట్ల డాలర్లను అధిగమించి కొత్తగా యూనికార్న్‌ హోదాను పొందాయి. దీంతో దేశంలో 100 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ వాల్యుయేషన్‌ ఉన్న స్టార్టప్‌ కంపెనీల సంఖ్య 84కు చేరింది. గత తొమ్మిది నెలల నుంచి దేశీయ స్టార్టప్‌ కంపెనీలు ప్రతి త్రైమాసికంలోనూ 1,000 కోట్ల డాలర్లకుపైగా ఇన్వెస్ట్ మెంట్లను ఆకర్షిస్తున్నాయి. కరోనాతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూలంగా నిలుస్తున్నప్పటికీ.. కొత్త పెట్టుబడులు రావటం గమనార్హం.

ఐటీ ఆధారిత స్టార్టప్‌ కంపెనీల్లోకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి. ‘సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌’ స్టార్టప్‌ కంపెనీలు ఈ విషయంలో మరింత ముందున్నాయి. 2022 మార్చి త్రైమాసికంలో ఈ తరహా స్టార్టప్‌ కంపెనీలు 350 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాయి. ఈ త్రైమాసికంలో మొత్తం 14 స్టార్టప్‌లు యూనికార్న్‌ కంపెనీల్లో 5 ఈ కోవకు చెందినవే ఉండటం విశేషం. గత మూడేళ్లలో ‘సాస్‌’ తరహా స్టార్టప్స్‌లోకి పెట్టుబడులూ మూడింతలు పెరిగాయి.

స్టార్టప్‌ కంపెనీల గణనీయంగా పెరగటంతో అవి యూనికార్న్‌గా మారడంతో వాటిలో నిర్వహణా ప్రమాణాలకు ప్రాధాన్యత కూడా పెరిగింది. ఇందులో కొన్ని కంపెనీలు.. పబ్లిక్‌ ఇష్యూలకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో స్టార్టప్స్‌లో విలీనాలు కూడా జోరుగా సాగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో స్టార్టప్స్‌లో 80 విలీనాలు, కొనుగోళ్లు జరిగాయి. ఈ-కామర్స్‌ స్టార్టప్స్‌లో ఎక్కువ విలీనాలు, కొనుగోళ్లు చోటు జరిగినట్లు తెలుస్తోంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Pak-Chian: ఖాన్ కంటే మెరుగ్గా షాబాజ్ పాలన ఉంటుంది.. పాకిస్తాన్‌పై కన్నేసిన డ్రాగన్ కంట్రీ..

LIC Policy: సామాన్యులకు అదిరిపోయే పాలసీ.. ప్రతీ నెలా 63 రూపాయలు చెల్లిస్తే.. మెచ్యూరిటీకి అధిక రాబడి!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!