Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 2.65 శాతం పడిపోయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్..
పెట్టుబడిదారులు త్రైమాసిక ఫలితాలపై తమ దృష్టిని మళ్లీంచడంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) స్టాక్‌ల కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్లు(Stcok Market) నష్టాల్లో ముగిశాయి.
పెట్టుబడిదారులు త్రైమాసిక ఫలితాలపై తమ దృష్టిని మళ్లీంచడంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) స్టాక్‌ల కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్లు(Stcok Market) నష్టాల్లో ముగిశాయి. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్చి త్రైమాసిక 2021-22 (FY22) కార్పొరేట్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి.30-షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 483 పాయింట్లు పతనమై 58,965 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nift) 109 పాయింట్లు క్షీణించి 17,675 వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.62 శాతం, స్మాల్ క్యాప్ 0.06 శాతం పతనమయ్యాయి. నిఫ్టీ ఐటీ, 1.41, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.56 శాతం వరకు పడిపోయాయి. నిఫ్టీ టాప్ లూజర్‌గా హెచ్‌సీఎల్ టెక్నాలజీ నిలిచింది. ఈ స్టాక్ 2.65 శాతం పడిపోయి రూ. 1,134 వద్ద స్థిరపడింది.
ఎల్‌అండ్‌టి, ఇన్ఫోసిస్, విప్రో, ఎస్‌బీఐ లైఫ్ నష్టాల్లో ముగిశాయి. 2,115 కంపెనీల షేర్లు పెరగ్గా 1,441 షేర్లు తగ్గాయి. 30-షేర్ల BSE ఇండెక్స్‌లో L&T, HCL టెక్, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, HDFC ట్విన్స్ (HDFC, HDFC బ్యాంక్), యాక్సిస్ బ్యాంక్ నష్టపోయాయి. HDFC లిమిటెడ్, HDFC బ్యాంక్ వరుసగా ఐదో సెషన్‌లో పడిపోయాయి. గత వారం మెగా-విలీనాన్ని ప్రకటించిన తర్వాత 10 శాతం పెరిగిన రెండు స్టాక్‌లు అంతే మొత్తంలో తగ్గాయి.
యోగా గురు రామ్‌దేవ్ రుచి సోయా ఇండస్ట్రీస్ షేర్లు కంపెనీ పేరును పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌గా మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత 0.56 శాతం పడిపోయి రూ. 918.25 వద్ద స్థిరపడ్డాయి. ఇంట్రాడే డీల్స్‌లో ఈ స్టాక్ నష్టాల్లో స్థిరపడకముందే 8 శాతానికి పైగా పెరిగింది. రుచి సోయా ఇటీవల తన ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) ద్వారా రూ.4,300 కోట్లను సమీకరించింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా లాభాల్లో ముగిశాయి.
Read Also… Bank Alert: ఆ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. భారీగా వడ్డీ రేట్లు తగ్గింపు..