Apple iPhone 13: భారత్ లో అమ్మే ఐఫోన్లు ఇకపై అక్కడ తయారైనవే.. ఎందుకంటే..

Apple iPhone 13: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌(Smart Phones) హవా కొనసాగుతోంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ మొబైల్‌ తయారీ కంపెనీలు రకరకాల స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

Apple iPhone 13: భారత్ లో అమ్మే ఐఫోన్లు ఇకపై అక్కడ తయారైనవే.. ఎందుకంటే..
Iphone
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 11, 2022 | 7:34 PM

Apple iPhone 13: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌(Smart Phones) హవా కొనసాగుతోంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ మొబైల్‌ తయారీ కంపెనీలు రకరకాల స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇక ప్రపంచ దేశాలలో మొబైల్‌ మార్కెట్‌ అతిపెద్ద వ్యాపార కేంద్రంగా మారింది. కొన్ని మొబైల్‌ తయారీ కంపెనీలు భారత్‌ లో మొబైళ్లను(Made In India) తయారు చేసే విధంగా దృష్టి సారిస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ ఆపిల్‌ భారత్‌లో కొత్త ప్లాంట్‌ను ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఆపిల్‌ ఐఫోన్‌ తయారీని చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. ఇప్పటికే ఆపిల్‌ ఐఫోన్‌ 13 ట్రయల్‌ తయారీని సైతం గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే నిర్వహించింది.

ఆపిల్‌ ఐఫోన్‌ 13 భారత్ లో తయారు చేయటం తమకు చాలా సంతోషంగా ఉందని కంపెనీ వెల్లడించింది. బ్యూటిఫుల్ డిజైన్, స్టన్నింగ్ ఫొటోలు, వీడియోలు తీసేందుకు అడ్వాన్స్ డ్ కెమెరా సిస్టమ్, A15 బయోనిక్ చిప్ అద్బుతమైన పనితీరు భారత కస్టమర్లను ఎంతగానో ఆకర్షిస్తుందని సంస్థ ధీమా వ్యక్తం చేసింది. వీటితో పాటు iPhone 12, iPhone 11 and iPhone SE (2020) మోడళ్లను కూడా దేశంలోనే యాపిల్ తయారు చేస్తోంది. దేశంలో అమ్మే ఐఫోన్లలో కనీసం 70 శాతం స్థానికంగానే తయారు చేయాలని కంపెనీ నిర్ణయించింది.

స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ డివైజ్‌లను భారతదేశంలో అసెంబ్లింగ్ చేయడానికి కీలకమైన ప్రోత్సాహకాల్లో ఒకటి 20% దిగుమతి పన్నుతో సహా దిగుమతి సుంకాలపై ఆదా లభించటంగా తెలుస్తోంది. ఆపిల్ చైనాలోని తన ఐఫోన్ ఉత్పత్తిలో 20% భారత్ కు భవిష్యత్తులో తరలించనుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి..

Oil Demand: మార్చిలో భారీగా అమ్ముడైన పెట్రోలు-డీజిల్.. కారణం అదే..

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 2.65 శాతం పడిపోయిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే