Viral Video: ఒకదానితో ఒకటి పోటీ పడుతూ జిమ్నాస్టిక్స్ చేస్తోన్న కుక్కలు.. ఫన్నీ వీడియో వైరల్
Viral Video: వీకెండ్ వస్తే చాలు.. బద్ధకం మనసొంతం అన్నట్లు గడిపేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికీ ఆనందాన్ని ఇచ్చే వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో అనేకం ఉన్నాయి. వాటిల్లో ఏవి బెస్ట్..
Viral Video: వీకెండ్ వస్తే చాలు.. బద్ధకం మనసొంతం అన్నట్లు గడిపేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికీ ఆనందాన్ని ఇచ్చే వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో అనేకం ఉన్నాయి. వాటిల్లో ఏవి బెస్ట్ అంటే.. ఖచ్చితంగా కుక్కలకు సంబంధించిన ఫన్నీ వీడియోలే (Funny Videos).. అందమైన పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే ఆటోమేటిక్ గా బద్ధకం మటుమాయమైపోతుంది.. హుషారు వస్తుంది.. తాజాగా ఓ రెండు కుక్కల ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో క్లిప్‌లో, రెండు కుక్కలు.. ఎంతో ఉత్సాహంగా జిమ్నాస్టిక్స్‌ను ప్రదర్శించడం చూడవచ్చు.
ఇప్పుడు వైరల్ అవుతున్నఈ వీడియోలో రెండు కుక్కలు స్టోర్‌రూమ్ లో ఆడుకుంటున్నాయి. బహుశా వాటి యజమాని లేకపోవడంతో.. కుక్కలకు మరింత స్వేచ్ఛ వచ్చినట్లు ఉంటుంది. ఆ స్టో రూమ్ లో రూఫ్ నుంచి వేలాడుతున్న నైలాన్ తాడుని పట్టుకుని ఊయలలా ఊగుతున్నాయి. ఆ తాడుని అందుకోవడానికి ముందుగా అక్కడ ఉన్న చెక్క బల్ల ఎక్కి.. అక్కడ నుంచి నైలాన్ తాడు వరకూ జంప్ చేసి.. మరీ ఆ తాడుని క్యాచ్ చేశాయి..
The owner finally left for work… Doggies: pic.twitter.com/pgdaeJ253q
— Interesting Channel (@ChannelInteres) April 8, 2022
ఒక కుక్క సరదాగా మొదలు పెట్టిన ఈ ఆటను .. రెండో కుక్క కూడా క్యాచ్ చేసింది. రెండు కుక్కలు తాడును పట్టుకుని కొంత సమయం పాటు ఊగుతూ ఉన్నాయి. వీడియో సోషల్ మీడియాలో జంతు ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం నాలుగు మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ఒక సోషల్ మీడియా వినియోగదారుడు “నా పిల్లలు చేయాలనుకుంటున్నది ఇదే” అంటూ కామెంట్ చేశారు.
Also Read: Pawan Kalyan: అన్నదాతకు అండగా పవన్ కళ్యాణ్.. రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న జనసేనాని