Viral Video: మనిషి ముఖాన్ని పోలిన సముద్రపు జీవి.. ఏలియన్‌ అంటూ ప్రచారం.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Viral Video: మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా.. ఎన్ని రకాల పరిశోధనలు చేసినా ఇప్పటికీ ఈ సృష్టిలో ఎన్నో ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. అడపాదడపా బయటపడే ఆసక్తికర విషయాలు మానవ పరిశోధనలకు సవాలు..

Viral Video: మనిషి ముఖాన్ని పోలిన సముద్రపు జీవి.. ఏలియన్‌ అంటూ ప్రచారం.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Viral Video
Follow us

|

Updated on: Apr 11, 2022 | 6:14 PM

Viral Video: మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంత ఎదిగినా.. ఎన్ని రకాల పరిశోధనలు చేసినా ఇప్పటికీ ఈ సృష్టిలో ఎన్నో ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. అడపాదడపా బయటపడే ఆసక్తికర విషయాలు మానవ పరిశోధనలకు సవాలు విసురుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచానికి కొత్తగా పరిచయమవుతోన్న కొన్ని వింత జంతువులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మనిషిని పోలినట్లు ఉన్న ఓ సముద్రపు జీవిని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాకు చెందిన డ్రూ లాంబెర్ట్ అనే ఓ వ్యక్తికి బోండి బీచ్‌లో ఓ వింత జీవి కనిపించింది. బీచ్‌లో సరదాగా గడుపుతోన్న సమయంలో సముద్రంలో నుంచి ఓ జీవికి కొట్టుకొచ్చింది. ఆ జీవి అసహజంగా ఉండడాన్ని గమనించిన డ్రూ వెంటనే స్మార్ట్‌ ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ జీవు ముందు భాగంలో అచ్చంగా మనిషిని పోలినట్లు పెదవులు, కళ్లు ఉన్నాయి. దీంతో ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన డ్రూ.. ‘ఏలియన్‌ను పోలినట్లు ఉన్న ఈ వింత జీవి ఎంటో చెప్పగలరా’ అంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

ముందు భాగం ముఖంలా, వెనక భాగం షార్క్‌లా పోలి ఉంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ జీవి ఏంటన్న దానిపై కామెంట్స్‌ చేస్తూ.. ఇది చనిపోయిన సముద్రపు జీవి భాగమని, నీటి కారణంగా అలా ఉబ్బిందని కామెంట్ చేశారు. అయితే సిడ్నీ సీలైఫ్‌ అక్వేరియంలో సూపర్‌ వైజర్‌గా పనిచేస్తున్న లాటిటియా హన్నన్‌ అనే వ్యక్తి మాత్రం.. ఈ జీవి కాఫిన్‌రే అనే జీవి అని తెలిపారు. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో కనిపిస్తాయి.

Also Read: China Lockdown: పుట్టినిల్లు చైనాని వణికిస్తున్న కరోనా… మరో మహానగరంలో కఠిన ఆంక్షలు.. స్కూల్స్, ఫ్యాక్టరీలు మూసివేత

LIC Policy: సామాన్యులకు అదిరిపోయే పాలసీ.. ప్రతీ నెలా 63 రూపాయలు చెల్లిస్తే.. మెచ్యూరిటీకి అధిక రాబడి!

NVS Class 6 Admit Card 2022: నవోదయ ఆరో తరగతి అడ్మిట్‌ కార్డు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..!