China Lockdown: పుట్టినిల్లు చైనాని వణికిస్తున్న కరోనా… మరో మహానగరంలో కఠిన ఆంక్షలు.. స్కూల్స్, ఫ్యాక్టరీలు మూసివేత

China Lockdown: కరోనా వైరస్ (Corona Virus)పుట్టినిల్లు చైనా (China) లో మళ్ళీ వేగంగా వ్యాప్తిస్తోంది. గతంలో కంటే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆగ్నేయంలోని షాంఘై(Shanghai) నుండి ఉత్తర ప్రావిన్సుల..

China Lockdown: పుట్టినిల్లు చైనాని వణికిస్తున్న కరోనా... మరో మహానగరంలో కఠిన ఆంక్షలు.. స్కూల్స్, ఫ్యాక్టరీలు మూసివేత
China Covid Outbreak
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Apr 11, 2022 | 7:17 PM

China Lockdown: కరోనా వైరస్ (Corona Virus)పుట్టినిల్లు చైనా (China) లో మళ్ళీ వేగంగా వ్యాప్తిస్తోంది. గతంలో కంటే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆగ్నేయంలోని షాంఘై(Shanghai) నుండి ఉత్తర ప్రావిన్సుల(Northern Provinces) వరకు దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోండడంతో.. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ సహా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అయితే తాజాగా డ్రాగన్ కంట్రీలో మరో మహానగరంలో లాక్ డౌన్ విధించారు అధికారులు. చాలా రోజుల తర్వాత చైనాలో ఆదివారం భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 27,509 కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి.

అయితే చైనాలో గ్వాంగ్జౌలో అత్యంత రద్దీగల ఎయిర్ పోర్ట్ తో పాటు, ఈ ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా పేరండి. అయితే ఇక్కడ కరోనా కేసులు నమోదు కావడంతో ఆంక్షలను విధించారు. ఇక్కడ తాజాగా 27 కేసులు నమోదయ్యాయి. కేసులు తక్కువగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న జనాభా రద్దీ దృష్ట్యా  భారీ ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఈ ప్రాంత జనాభా కోటి 80 లక్షలు. ఇప్పటికే దక్షిణ గ్వాంగ్జౌ లో పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఆన్ లైన్ లో చదువులు చెప్పనున్నారు. ఈ ఆంక్షలు నగరంలో ఒక వారం పాటు కొనసాగుతాయి.

అవసరమైతే తప్ప స్థానికులు నగరాన్ని విడిచి వెళ్లకూడదని..ఒక వేళ నగరాన్ని విడిచి బయటకు వెళ్లాలనుకునేవారు 48 గంటల ముందు కరోనా వైరస్ పరీక్ష చేయించుకోవాలని.. నెగెటివ్ అని సర్టిఫికెట్ చూపించాలని మున్సిపల్ అధికారులు తెలిపారు. మరోవైపు నగరవ్యాప్తంగా కొవిడ్​ పరీక్షలను సంఖ్యను పెంచారు.  నగరంలోని ఎగ్జిబిషన్ కేంద్రాలను తాత్కాలిక ఆసుపత్రులుగా మారుస్తున్నారు.

మరోవైపు ప్రముఖ పట్టణం షాంఘై లాక్‌డౌన్‌లో ఉంది. షాంఘై ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను గత నెల మార్చి 12న ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. రెండు దశల లాక్‌డౌన్ విధించారు. కోవిడ్ కారణంగా ఉత్తర ప్రావిన్స్ జిలిన్, షాంఘై  సమీపంలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఫ్యాక్టరీలను మూసివేశారు.

Also Read: AP: మంత్రులకు శాఖల కేటాయించిన సీఎం జగన్.. ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే