AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cabinet: మంత్రులకు శాఖల కేటాయించిన సీఎం జగన్.. ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు

ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వద్ద జరిగింది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తాజాగా సీఎం జగన్ మంత్రులకు శాఖలు కేటాయించారు.

AP Cabinet: మంత్రులకు శాఖల కేటాయించిన సీఎం జగన్.. ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు
Ap New Ministers
Ram Naramaneni
|

Updated on: Apr 11, 2022 | 4:40 PM

Share

ఏపీలో కొత్త కేబినెట్‌ కొలువు దీరింది. 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది. అంబటి రాంబాబు(Ambati Rambabu) నుంచి మొదలు పెట్టి విడదల రజని(Vidadala Rajini) వరకు మంత్రులు ప్రమాణం చేశారు. ముగ్గురు మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్‌(Adimulapu Suresh), ఉషశ్రీ చరణ్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఇంగ్లీష్‌లో ప్రమాణం స్వీకారం చేశారు. మిగిలిన వారంతా తెలుగులోనే చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌కు, గవర్నర్‌కు ధన్యవాదాలు చెప్పారు. చాలా మంది సీఎం జగన్‌ కాళ్లకు నమస్కారం చేశారు. ప్రమాణం తర్వాత కొత్త మంత్రులతో గ్రూప్‌ ఫొటో దిగారు సీఎం జగన్‌, గవర్నర్‌ హరిచందన్‌. కాగా ఏపీ మంత్రులుకు సీఎం జగన్ శాఖలు కేటాయించారు. ఏపీ కేబినెట్‌లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉండనున్నారు. రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్‌ బాషా, కొట్టు సత్యనారాయణ,  నారాయణస్వామిలకు ఉప ముఖ్యమంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు.

మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు దిగువన చూడండి:

    1. ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
    2. సీదిరి అప్పలరాజు – పశుసంవర్ధక, మత్స్యశాఖ
    3. దాడిశెట్టి రాజా – రహదారులు, భవనాలశాఖ
    4. గుడివాడ అమర్నాథ్‌ – పరిశ్రమలు, ఐటీ శాఖ
    5. వేణుగోపాల్ – బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాలు
    6. తానేటి వనిత – హోంశాఖ
    7. జోగి రమేష్‌ – గృహనిర్మాణ శాఖ
    8. కారుమూరి నాగేశ్వరరావు – పౌరసరఫరాలశాఖ
    9. మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమశాఖ
    10. విడదల రజని – వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
    11. కొట్టు సత్యనారాయణ – దేవదాయశాఖ
    12. బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ 
    13. అంబటి రాంబాబు – జలవనరుల శాఖ
    14. ఆదిమూలపు సురేశ్‌ – పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
    15. కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
    16. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ
    17. ఆర్‌.కె.రోజా – పర్యాటక, యువజన, క్రీడల శాఖ
    18. కె.నారాయణ స్వామి – ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ
    19. అంజాద్ బాషా – ఉపముఖ్యమంత్రి, మైనారిటీ వెల్ఫేర్
    20. బుగ్గన – ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
    21. గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
    22. ఉషశ్రీ చరణ్ – మహిళా శిశుసంక్షేమశాఖ
    23. బూడి ముత్యాలనాయుడు-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
    24. రాజన్నదొర – ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ
    25. పినిపే విశ్వరూప్ – రవాణాశాఖ

Also Read: AP: అట్టుడుకుతున్న జగ్గయ్యపేట.. ఆ కోటరీ కారణంగానే పదవి రాలేదన్న ఉదయభాను