AP: అట్టుడుకుతున్న జగ్గయ్యపేట.. ఆ కోటరీ కారణంగానే పదవి రాలేదన్న ఉదయభాను

ఏపీలో కొత్త కేబినెట్ కొలువు దీరింది. 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రి పదవి దక్కని అసంతృప్తులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.

AP: అట్టుడుకుతున్న జగ్గయ్యపేట.. ఆ కోటరీ కారణంగానే పదవి రాలేదన్న ఉదయభాను
Samineni Udayabhanu
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 11, 2022 | 3:50 PM

సీనియర్ ఎమ్మెల్యేగా..  కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించానని వైసీపీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(Samineni Udaya Bhanu)అన్నారు.  ఎక్కడో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్లే తనకు మంత్రి పదవి రాలేదమోనని వ్యాఖ్యానించారు. జగన్‌(Cm Jagan) చుట్టూ జిల్లాకు చెందిన కొందరు కోటరీలా తయారయ్యారని, పార్టీ కార్యక్రమాలు చేయకుండా, ప్రజల్లో ఉండకుండా సీఎం ఆఫీస్‌ చుట్టూ తిరగడమే వారి పని అని విమర్శించారు. అటు వారు తనపై అసత్య సమాచారం ఇచ్చారేమోనని వ్యాఖ్యానించారు. తన తర్వాత పార్టీలోకి వచ్చినవారికి మంత్రి పదవి ఇచ్చినా బాధపడలేదన్నారు. ఈ విడతలోనైనా ఇస్తారని భావించానని,  అన్ని విధాలా మంత్రి పదవికి తాను అర్హుడినని స్పష్టం చేశారు. పదవి ఎందుకు ఇవ్వలేదో అధిష్ఠానం ఆలోచన చేయాలని ఉదయభాను చెప్పారు. వైసీపీ(Ysrcp) ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేశానని చెప్పారు. భాను ఆవేదనను దిగువ వీడియో చూడండి..

కాగా మంత్రి పదవి దక్కకపోవడంతో ఉదయభాను అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి కంటిన్యూగా ఆందోళన చేస్తున్నారు. భానుకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో రోడ్లపై టైర్లు తగులబెట్టారు. ఉదయభానుకు అనుకూలంగా పెద్దయెత్తున ఆందోళన చేశారు. మరోవైపు జగ్గయ్యపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ లిస్ట్ బయటికి రాక ముందు వరకు కూడా భాను ఎంతో ధీమాగా ఉన్నారు. సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఎందుకు రాదంటూ మీడియాతో మాట్లాడారు. కానీ ఫైనల్ లిస్ట్‌లో మాత్రం పేరు లేదు. ప్రస్తుతం విప్‌గా ఉన్నారు భాను. వైఎస్సార్ హయాంలో కూడా విప్‌గా పనిచేశారు. జగన్ సీఎం అయ్యాక తొలిసారే కేబినెట్‌లో బెర్త్ ఆశించారు భాను. కానీ విస్తరణలో పక్కాగా ఇస్తామని అప్పట్లో నచ్చజెప్పారు జగన్.

Also Read: AP: ఆ కుటుంబానికి ఎంతో దగ్గరిగా మెలిగా.. మంత్రి పదవి రాకపోవడంపై ధర్మశ్రీ కన్నీళ్లు