AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cabinet: మరోసారి దళిత మహిళకే హోంశాఖ.. ఐదుగురికి ఇంటర్ కంటే తక్కువ విద్యార్హతలు!

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈసారి కూడా ఐదుగరు డిప్యూటీ సీఎంలను నియమించారు.. అలాగే హోంమంత్రి పదవి దళిత మహిళకు దక్కింది.

AP Cabinet: మరోసారి దళిత మహిళకే హోంశాఖ.. ఐదుగురికి ఇంటర్ కంటే తక్కువ విద్యార్హతలు!
Vanitha Home Minister
Balaraju Goud
|

Updated on: Apr 11, 2022 | 5:05 PM

Share

AP New Cabinet: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కేబినెట్‌లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈసారి కూడా ఐదుగరు ఉప ముఖ్యమంత్రులను నియమించారు.. అలాగే హోంమంత్రి(Home Minister) పదవి దళిత మహిళకు దక్కింది. డిప్యూటీ సీఎంలుగా నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, అంజాద్ బాషా, ముత్యాల నాయుడు, రాజన్న దొరకు పదవులు దక్కాయి. హోంమంత్రిగా తానేటి వనితకు అవకాశం ఇచ్చారు. మొదటి నుంచీ రాష్ట్ర హోం శాఖను నగరి ఎమ్మెల్యే రోజాకు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా హోంశాఖను తానేటి వనితకు కేటాయించారు. గతంలో మేకతోటి సుచరిత హోంశాఖ మంత్రిగా ఉన్నారు. రోజాకు రాష్ట్ర పర్యాటక, యువజన, క్రీడల శాఖను కేటాయించారు.

గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఈసారీ ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌ చేపట్టిన శాఖలలో మార్పులు చేసి విద్యా శాఖను బొత్సకు.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను సురేశ్‌కు కేటాయించారు. నారాయణస్వామికి మళ్లీ డిప్యూటీ సీఎం పదవితో పాటూ ఎక్సైజ్ శాఖ దక్కింది. అంజాద్‌బాషాకు డిప్యూటీ సీఎం పదవి, మైనార్టీ సంక్షేమం అప్పగించారు. సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్థకశాఖ కొనసాగించారు. గుమ్మనూరు జయరాంకు కార్మిక శాఖను తిరిగి అప్పగించారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు గతంలో ఉన్న బీసీ సంక్షేమంతో పాటూ సినిమాటోగ్రఫీ, సమాచార శాక బాధ్యతలు కేటాయించారు. అంబటి రాంబాబుకు కీలకమైన నీటిపారుదలశాఖ బాధ్యతలు ఇవ్వడం విశేషం. ఊహించని విధంగా మంత్రి బొత్సకు విద్యాశాఖ దక్కింది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఒకరు డాక్టర్‌ కాగా, ముగ్గురు పీహెచ్‌డీలు పూర్తి చేశారు. ఐదుగురు మంత్రులు పోస్టు గ్రాడ్యుయేట్లు కాగా, 9 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇద్దరు మంత్రులు ఇంజినీర్లు. ఇక, ఇంటర్మీడియట్‌ కంటే తక్కువగా విద్యార్హతలు కలిగి ఉన్నవారు ఐదుగురు మంత్రులు ఉన్నారు. మంత్రుల్లో నలుగురు మహిళలకు అవకాశం దక్కింది. సీఎం వైఎస్ జగన్ రెండో విడత మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు కట్టబెట్టారు సీఎం జగన్.

ఏపీ మంత్రులు-శాఖలు

    1. రాజన్నదొర – గిరిజన సంక్షేమం (డిప్యూటీ సీఎం)
    2. బూడి ముత్యాలనాయుడు – పంచాయతీరాజ్ (డిప్యూటీ సీఎం)
    3. కొట్టుసత్యనారాయణ – దేవాదాయ (డిప్యూటీసీఎం)
    4. అంజాత్ బాషా – మైనార్టీ వ్యవహారాలు-(డిప్యూటీ సీఎం)
    5. నారాయణస్వామి – ఎక్సైజ్ శాఖ (డిప్యూటీ సీఎం)
    6. తానేటి వనిత – హోం మంత్రి
    7. ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
    8. సీదిరి అప్పలరాజు – పశుసంవర్ధక,మత్స శాఖలు
    9. బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ
    10. గుడివాడఅమర్నాథ్ – ఐటీ, పరిశ్రమలు
    11. విశ్వరూప్ – రవాణాశాఖ
    12. చెల్లుబోయిన వేణు – ఐఅండ్ పీఆర్, బీసీసంక్షేమం, సినిమాటోగ్రఫీ
    13. దాడిశెట్టిరాజా – రోడ్లు భవనాలు
    14. కారుమూరినాగేశ్వరరావు – పౌరసరఫరాలు
    15. జోగి రమేష్ – గృహనిర్మాణం
    16. మేరుగు నాగార్జున – సాంఘికసంక్షేమం
    17. విడదల రజనీ – ఆరోగ్య, కుటుంబసంక్షేమం
    18. అంబటి రాంబాబు – జలవనరులశాఖ
    19. ఆదిమూలపుసురేష్ – మున్సిపల్ శాఖ
    20. కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకారశాఖ
    21. ఉషా శ్రీచరణ్ – స్త్రీ శిశు సంక్షేమం
    22. బుగ్గన రాజేంద్రనాథ్ – ఆర్ధిక, వాణిజ్యపన్నులు, ప్రణాళిక
    23. గుమ్మనూరు జయరాం – కార్మికశాఖ
    24. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, అటవీ, పర్యావరణం
    25. ఆర్‌కే రోజా – టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు