- Telugu News Photo Gallery Cricket photos IPL Points Table 2022 Standings ranking Purple Cap list in telugu after Rajasthan Royals vs Lucknow Super Giants in telugu 11th April 2022
IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్ రేసులో స్పిన్నర్లదే హవా.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?
పర్పుల్ క్యాప్ ఫైట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఉమేష్ యాదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. ఐదు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక ఆ 5 మ్యాచ్‌ల్లో..
Updated on: Apr 11, 2022 | 12:49 PM

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్‌ల తర్వాత రాజస్థాన్‌కు చెందిన యుజ్వేంద్ర చాహల్ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్-15లో 4 మ్యాచ్‌లు ఆడిన చాహల్ 16 ఓవర్లలో 104 పరుగులిచ్చి 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆదివారం లక్నోపై తీసిన 4 వికెట్లు కూడా ఉన్నాయి.

పర్పుల్ క్యాప్ ఫైట్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఉమేష్ యాదవ్ రెండో స్థానానికి పడిపోయాడు. ఐదు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక ఆ 5 మ్యాచ్‌ల్లో 20 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేష్ 132 పరుగులు ఇచ్చాడు.

పర్పుల్ క్యాప్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు కుల్దీప్ 4 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. వాటిలో ఆదివారం కేకేఆర్‌పై 4 వికెట్లు తీశాడు. చైనామన్ బౌలర్ 15.4 ఓవర్లలో 116 పరుగులు ఇచ్చాడు.

పర్పుల్ క్యాప్ ఫైట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు వనిందు హసరంగ నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. ఈసారి ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన హసరంగ 6 వికెట్లు తీశాడు. ఇక ఈ RCB క్రికెటర్ 18 ఓవర్లలో 120 పరుగులు ఇచ్చాడు.

ఈ జాబితాలో లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన అవేష్ ఖాన్ 5వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అవేష్ 15 మ్యాచ్‌లు ఆడి 18.4 ఓవర్లలో 156 పరుగులు చేశాడు. అలాగే 6 వికెట్లు పడగొట్టాడు.




