Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్‌ చాలా స్పెషాల్..

భూమిపై ఇప్పటి వరకు గుర్తించిన వజ్రాలలో అత్యంత విలువైన, అరుదైనదిగా చెప్పబడుతున్న ఈ "బ్లాక్ డైమండ్" ఇప్పుడు లండన్ చేరుకుంటోంది. ఈ "బ్లాక్ డైమండ్"లో చాలా విశేషాలున్నాయి. విశ్వంలోని సుదూర ప్రాంతం నుంచి భూమికి చేరినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.

Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్‌ చాలా స్పెషాల్..
Black Diamond
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 19, 2022 | 11:34 PM

వజ్రం సహజంగానే మెరుస్తుంది. వజ్రానికి ఉండే మెరుపు దాని విలువను చెబుతుంది. ఆ మెరుపే దానికి గుర్తింపు తెస్తుంది. అయితే అన్ని వజ్రాలు వేరు.. నలుపు వజ్రం వేరు. మరి బ్లాక్ డైమండ్ సంగతేంటి..? దీనికి ఎందుకు ఇంత డిమాండ్..? అదేంటో.. దాని సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మనకు తెలిసిన సింగరేణి బొగ్గును “నల్ల బంగారం” అంటాం.. ఎందుకంటే అది మనకు సహజంగా భూమిలో లభించే విలువైన ఖనిజం. అయితే బొగ్గు సహజంగా నలుపు రంగులో ఉంటుంది. అదే బొగ్గు తవ్వకాల్లో లభించే వజ్రం మాత్రం తెల్లగా మెరుస్తుంది. బొగ్గుతో పోల్చితే.. వజ్రం ధర కొన్ని లక్షల రెట్లు అధికంగా ఉంటుంది. వజ్రం ఎంత తెల్లగా ఉంటే.. అంత నాణ్యమైనదిగా గుర్తిస్తారు నిపుణులు. అందుకే అత్యంత తెల్లటి డైమండ్స్ కి ఎక్కువ ధర నిర్ణయిస్తారు. అయితే తాజాగా దుబాయ్‌లో లభించిన ఈ బ్లాక్ డైమండ్ లెక్కే వేరని చెప్పాలి. ఇదంతా రివర్స్‌లో లెక్కిస్తారు.

ఈ బ్లాక్ డైమండ్‌కి “ది ఎనిగ్మా” (The Enigma) అని పేరు పెట్టారు. దీని బరువు 555 క్యారెట్ల. దీనికి మరో ప్రత్యేకత ఉంది తెలుసా.. ఇది 260 కోట్ల సంవత్సరాలకు ముందు భూమిపై ఓ గ్రహశకలం (Asteroid) లేదా ఉల్క ఢీకొనడంతో పడిందని నమ్ముతున్నారు. అందుకే ఇది మామూలు డైమండ్ కాదంటున్నారు. ఇలాంటి వజ్రాలు అతి పురాతనమైనవనీ.. ఇవి అంతరిక్షం నుంచి పుట్టినట్లుగా భావిస్తున్నారు.

భూమిపై ఇప్పటి వరకు గుర్తించిన వజ్రాలలో అత్యంత విలువైనది.. అరుదైనదిగా చెప్పబడుతున్న ఈ “బ్లాక్ డైమండ్” ఇప్పుడు లండన్ చేరుకుంటోంది. ఈ “బ్లాక్ డైమండ్”లో చాలా విశేషాలున్నాయి. విశ్వంలోని సుదూర ప్రాంతం నుంచి భూమికి చేరినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. మీరు ఈ బ్లాక్ డైమండ్ గురించి విని ఉంటారు. వజ్రాలు చాలా ఖరీదైనవి ఇది ఆశ్చర్యం లేదు.. కానీ ఎవరైనా వజ్రం ముక్క 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వేస్తున్నారు.

ఫిబ్రవరిలో లండన్‌లో వేలం..

వజ్రాల వేలం సంస్థ “సోత్‌బైస్” దుబాయ్ సోమవారం దుబాయ్‌లో వజ్రాలను ప్రదర్శించింది. వజ్రాన్ని ది ఎనిగ్మా అని పిలుస్తారు. ఇది 555.55 క్యారెట్ల నల్లని వజ్రం. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంది. ఇది అక్కడి నుంచి లాస్ ఏంజెల్స్‌కు తీసుకెళ్లనున్నారు. ఈ వజ్రాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌లో వేలం వేయనున్నారు.

  •  లండన్ లో ఫిబ్రవరి 3 నుంచి 9 తేదీల మధ్య ఈ బ్లాక్ డైమండ్ ను వేలం వేస్తారు
  • ఈ బ్లాక్ డైమండ్ కు ఎటువంటి రిజర్వ్ ధర ఇప్పటివరకు నిర్ణయించలేదు
  • •ఎందుకంటే వజ్రాలు అరుదుగా లభిస్తాయి.. వేలం సైతం అరుదుగానే సాగుతాయంటున్న నిర్వాహకులు
  • 2001లో చివరిసారిగా లండన్ లో 33 క్యారెట్ల వజ్రాన్ని వేలం వేశారు.
  • తాజాగా ఇప్పుడు వేలం వేయనున్న వజ్రం బరువు దాని కంటే 17 రెట్లు పెద్దది

ఈ వజ్రాలు కేవలం రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి

నల్ల వజ్రాన్ని కార్బొనాడో అని కూడా అంటారు. ఇటువంటి వజ్రాలు చాలా అరుదుగా పరిగణించబడతాయి. ఇవి బ్రెజిల్, మధ్య ఆఫ్రికాలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటి వజ్రాలలో కనిపించే కార్బన్ ఐసోటోపులు, హైడ్రోజన్ అధిక కంటెంట్ కారణంగా అవి అంతరిక్షం నుండి వచ్చినట్లు భావిస్తున్నారు. అవి భూమిని ఉల్క ఢీకొనడం వల్ల ఏర్పడినవి లేదా మరొక ప్రపంచం నుండి వారితో కలిసి ఇక్కడకు వచ్చాయి.

ఈ వజ్రం చాలా విలువైనది

వేలంలో ఈ వజ్రం 50 మిలియన్ బ్రిటీష్ పౌండ్లు (సుమారు రూ. 50.7 కోట్లు) పలుకుతుందని సోత్‌బైస్ అంచనా వేసింది. క్రిప్టోకరెన్సీలో చెల్లించడాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది. వజ్రాలు ఖమ్సా ఆకారంలో ఉన్నాయని సోథెబీస్ దుబాయ్‌లోని ఆభరణాల స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ ఏపీకి తెలిపారు. పశ్చిమాసియా దేశాలలో, అరచేతి ఆకారాన్ని ఖమ్సా అని పిలుస్తారు. దాని అర్థం బలం

  • ప్రపంచంలోనే అతి పెద్ద నల్ల వజ్రంగా గుర్తింపు
  • సహజసిద్ధంగా నల్లరంగులో లభించిన డైమండ్ ఇది
  • తొలిసారిగా ఈ డైమండ్ ను ప్రజలకు ప్రదర్శిస్తున్న దీని యజమాని
  • రెందు దశాబ్దాలుగా దీన్ని దాచిపెట్టిన యజమాని
  • 2006లో అతిపెద్ద కట్ డైమండ్ గా గిన్నెస్ రికార్డుల్లోకి ఎక్కిన ఈ బ్లాక్ డైమండ్
  • అరుదైన, అపురూపమైన బ్లాక్ డైమండ్ ను చూడాలంటే దుబాయ్ వెళ్లాల్సిందే
  • జనవరి 17 దుబాయ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సెంటర్లోని ‘సోథెబై’ ఆడిటోరియంలో బ్లాక్ డైమండ్ ను ఆవిష్కరించారు
  • సోథెబై అనేది అపురూప కళాకండాలు, నగలు సేకరించి వేలంవేసే సంస్థ
  • గురువారం వరకు దీన్ని ప్రదర్శించనున్న నిర్వాహకులు
  • అనంతరం లాస్ ఏంజెల్స్, తర్వాత లండన్ కు ప్రయాణించనున్న ఈ బ్లాక్ డైమండ్

బ్లాక్ డైమండ్ ప్రత్యేక ఆకర్షణ

అవి నల్లని రేణువులు కాబట్టి అవి నల్లగా ఉంటాయి. అవి అపారదర్శకమైనవి. మీరు దానిని వైపు నుండి చూస్తే, మీరు కొన్నిసార్లు నల్ల వజ్రాలు ముదురు గోధుమ, ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. చాలా నల్ల వజ్రాలు అరుదుగా కనిపించే సహజ నల్ల కణాలతో తయారు చేయబడ్డాయి. ఒకే తేడా ఏమిటంటే అవి తెల్లని వజ్రాల కంటే చాలా తక్కువ ధర.

బ్లాక్ డైమండ్ స్పెషాలిటీ..

  • దీని బరువు 555.55 క్యారెట్లు
  • ముఖ తలాలు 55 ఉన్న ఈ డైమండ్ •అరుదైనదంటున్న సొథెబై నిర్వాహకులు
  • ఈ డైమండ్ 2.6 నుంచి 3.8 బిలియన్ ఏళ్లకు పూర్వం నాటిదని చెబుతున్న సోథెబై నిఫుణులు

ఈ వజ్రం ఎక్కడదన్నదానిపై భిన్నవాదనలు..

వజ్రం ఎక్కడున్నదన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా తెల్లని వజ్రాలు లేదా రంగు వజ్రాలు అరుదైన కింబర్లైట్ శిలలు భూ ఉపరితలంపైకి వచ్చినప్పుడు బయటపడతాయి. అగ్ని పర్వతాలు పేలిన సమయంలో ఈ శిలలు ఉపరితలంపైకి చేరుకుంటాయంటున్నారు నిపుణులు. అదేవిధంగా బ్లాక్ డైమండ్స్ సైతం అగ్నిపర్వతంలోని శిలా ద్రవాలు(లావా) ప్రవహించి.. ఒండ్రు మైదానాల్లో నిక్షేపితమైన ప్రాంతాల్లో ఇవి దొరికే అవకాశముంది. భూమిపై అటువంటి ప్రాంతాలున్న దేశాలు బ్రెజిల్, మధ్య ఆఫ్రికా దేశాలు మాత్రమే కనిపిస్తుంటాయి.

ఇది భూమి నుంచి తీసిన డైమండ్ కాదంటున్న నిపుణులు..

ఇది భూమి మీద లభించిన డైమాండ్ కాదంటున్నారు నిపుణులు. అయితే ఇది ఆకాశంలోంచి  పడిందని చెబుతున్నారు. ఉల్క నుంచి పరిగ్రహించిన వజ్రం లేదా గ్రహశకలం భూమిని ఢీకొన్న సమయంలో ఇది వెలుపలికి వచ్చి ఉండొచ్చంటున్నారు నిపుణులు. కోట్ల సంవత్సరాల క్రితం రెండు ఖండాలు అనుసంధానమై సూపర్ కంటినెంట్ ‘రోడినియా’ ఏర్పడే క్రమంలో ఇటువంటి వజ్రాలు బయటపడ్డాయంటున్నారు మరి కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ఇది.

బ్లాక్ డైమండ్ ఆకారం(షేప్)..

ఈ బ్లాక్ డైమండ్ ఆకారం కూడా విచిత్రంగా ఉంది. ఈ డైమండ్ షేప్ శక్తికి, బలానికి, భద్రతకు చిహ్నమైన ‘హంస’ సూచిస్తుంది. మధ్య ప్రాచ్య దేశాల్లోని అరచేతి ఆకారంలో ఉన్న హంస చిహ్నం ఐదు సంఖ్యను సూచిస్తుంది. ఈ బ్లాక్ డైమండ్ బరువు సైతం 555.55 క్యారెట్లు 55 ముఖ తలాలు కలిగివుండటం విశేషం. 1990లో బ్లాక్ డైమండ్ ను ముడి ఖనిజంగా పొందినట్లుగా ప్రస్తుత యజమాని చెబుతున్నాడు. హంస చిహ్నంతో ప్రేరణ పొందిన యజమాని.. దానికి సానబెట్టి 55 ముఖాలతో తీర్చిదిద్దాడు.

డైమండ్ లక్షణాలు..

  • కాఠిన్యం చాలా ఎక్కువ
  • ఇప్పటికే ఉన్న అన్ని ఘనపదార్థాలలో అత్యధిక ఉష్ణ వాహకత, వ్యాప్తి కలిగివుంటుంది
  • అధిక వక్రీభవన సూచిక
  • గాలిలో లోహం కోసం ఘర్షణ తక్కువ గుణకం
  • విద్యుద్వాహక లక్షణాలుంటాయి

ఈ రత్నాలు, అతినీలలోహిత, కాథోడ్ లేదా ఎక్స్-కిరణాల ప్రభావంతో, వివిధ రంగులలో మెరుస్తూ, ప్రకాశిస్తాయి

ఇవి కూడా చదవండి: Tongue Color: గుండెపోటును మన నాలుక రంగుతో తెలుసుకోవచ్చు.. ఎలా గుర్తించాలంటే..?

Parenting Tips: మీ చిన్నారులు స్మార్ట్ ఫోన్‌తోనే ఉంటున్నారా.. అయితే డేంజర్ జోన్‌లోనే ఉన్నట్టే.. మరిన్ని వివరాలు..

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ