AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crow Playing: తెలివైన కాకి బొమ్మలతో భలేగా ఆడుకుంటోంది కాకిని చూసిన ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..(వీడియో)

Crow Playing: తెలివైన కాకి బొమ్మలతో భలేగా ఆడుకుంటోంది కాకిని చూసిన ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..(వీడియో)

Anil kumar poka
|

Updated on: Jan 19, 2022 | 9:12 PM

Share

సాధారణంగానే కాకులు చాలా తెలివైనవి అంటారు..అవి మనుషులు చేసే పనులు చూసి..త్వరగా నేర్చుకుని అనుకరిస్తుంటాయి..అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఇక్కడో కాకి..ఇది ఏం చేసిందో తెలిస్తే..మీరు కూడా ఆశ్చర్యపోతారు...


సాధారణంగానే కాకులు చాలా తెలివైనవి అంటారు..అవి మనుషులు చేసే పనులు చూసి..త్వరగా నేర్చుకుని అనుకరిస్తుంటాయి..అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఇక్కడో కాకి..ఇది ఏం చేసిందో తెలిస్తే..మీరు కూడా ఆశ్చర్యపోతారు… చూస్తున్నారుగా..ఇక్కడ ఓ కాకి ముందు… చిన్న చిన్న బొమ్మ కుండీలు వేర్వేరు సైజుల్లో కనిపిస్తున్నాయి…చిన్న కుండీలను పెద్ద కుండీలలో వెయ్యాలి… అదే ఆట. ఆ ప్రకారం… కాకి తన ముక్కుతో… చిన్న కుండీలను పెద్ద వాటిలో ఎలా చక్కగా వేస్తూ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అయితే, ఇదంతా ఆ ఇంట్లోని వారు వీడియో తీశారు..పైగా, పక్కనే ఓ కుక్క కూడా ఉంది..ఓ సారి ఆ కుక్క కాకి దగ్గరకు రాబోయే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న వ్యక్తి దాన్ని వారించారు…దీన్ని బట్టి ఈ రెండింటినీ బహుశా ఆ ఇంటివారు పెంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఒద్దిగా కూర్చున్న కాకి, ఓపికతో ఆటలాడుతోంది. పైగా ఆ కాకి కాలికి ఎవరో బలవంతంగా రింగ్స్ తొడిగినట్లు, వాటి నుంచి కాకిని కాపాడినట్లుగా కనిపిస్తోంది. కాకులు భలే తెలివి మీరిపోతున్నాయంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. కాకి అలా చేస్తున్నప్పుడు పాపం కుక్క దూరం నుంచి చూస్తోంద అంటూ మరో నెటిజన్ దానిపై జాలిపడుతూ కామెంట్ చేశారు.

Published on: Jan 19, 2022 08:39 PM