Astronaut: మీకు తెలుసా.. వ్యోమ‌గాముల విషయంలో అంత‌రిక్షంలో అలా జరుగుతోందట..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jul 22, 2021 | 9:22 PM

లోక‌ల్.. నేష‌న‌ల్.. ఫారిన్ తో పాటు ఇప్పుడు స్పేస్ టూరిజం అనే న‌యా ట్రెండ్ మొద‌లైంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ స్పేస్ ట్రిప్పే అందుకు ఉదాహ‌ర‌ణ‌.

Astronaut: మీకు తెలుసా.. వ్యోమ‌గాముల విషయంలో అంత‌రిక్షంలో అలా జరుగుతోందట..
Astronauts
Follow us

Astronaut: లోక‌ల్.. నేష‌న‌ల్.. ఫారిన్ తో పాటు ఇప్పుడు స్పేస్ టూరిజం అనే న‌యా ట్రెండ్ మొద‌లైంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ స్పేస్ ట్రిప్పే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌స్తుతానికైతే బిలినీయర్లు, స్పేస్ టెక్నాల‌జీపై అవగాహ‌న ఉన్నవారు మాత్ర‌మే అంత‌రిక్షంలోకి వెళ్ల‌గ‌లుగుతున్నారు. భ‌విష్య‌త్తులో సామాన్యులు సైతం టికెట్లు కొనుగోలు చేసి అంత‌రిక్షంలో ప‌ర్య‌టించే రోజులు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే అంత‌రిక్షంలో మ‌న శ‌రీరం ఎలాంటి మార్పుల‌కు లోన‌వుతుంది..? అనే దానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వాస్త‌వానికి.. భూమిపై ఉండే వాతావ‌ర‌ణానికి, రోదసి వాతావ‌ర‌ణానికి చాలా తేడా ఉంటుంది. రోద‌సిలో వ్యోమ‌గాములు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఉంటారు. దానివ‌ల్ల వారి శ‌రీరాలలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి.

అంత‌రిక్షంలో ఎక్కువ రోజులు గడిపే వ్యోమ‌గాములు ఎత్తు పెరుగుతారట. ఎందుకంటే అంత‌రిక్షంలో వారు పూర్తిగా భార ర‌హిత స్థితికి చేరుకుంటారు. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తి లేని కార‌ణంగా నిల‌బ‌డ‌లేక‌ గాల్లో తేలియాడుతుంటారు. ఫలితంగా శ‌రీరం కొద్దికొద్దిగా సాగిపోతుంటుంది. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్యోమగామి 6 అడుగుల పొడవు ఉంటే.. కక్ష్యలో ఉన్నప్పుడు రెండు అంగుళాలు పొడ‌వు పెరుగుతార‌ని అమెరికాలోని సైన్స్ మ్యాగ‌జైన్ తెలిపింది. అయితే వారు భూమికి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత సాధార‌ణ‌ స్థితికి చేర‌డానికి త‌గిన ఏర్పాట్లు చేస్తారు. మ‌న‌లాగానే న‌డ‌వడానికి ప‌రుగెత్త‌డానికి వారికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Srivani : పుట్టుకనే.. బాబు అవహేళన చేస్తే.. సీఎం జగన్‌ పక్షపాతిగా దేశానికే ఆదర్శమయ్యారు : పుష్పశ్రీవాణి

New Virus: టిబెట్ గ్లాసియర్‌లో  15 వేల ఏళ్లనాటి మంచులో 28 కొత్త వైరస్‌లు కనుగొన్న శాస్త్రవేత్తలు..

Hindu Temples in US: భారతీయ శిల్పకళ, హిందూ సంప్రదాయాలను అద్దంపట్టేలా అమెరికాలోని ప్రఖ్యాత దేవాలయాలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu