Pushpa Srivani : పుట్టుకనే.. బాబు అవహేళన చేస్తే.. సీఎం జగన్ పక్షపాతిగా దేశానికే ఆదర్శమయ్యారు : పుష్పశ్రీవాణి
ఆడవాళ్ల పుట్టుకనే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తే.. సీఎం జగన్ మహిళా పక్షపాతిగా దేశానికే ఆదర్శమయ్యారని విజయనగరంలో వ్యాఖ్యానించారు..
AP Dy CM Pushpa Srivani : ఆడవాళ్ల పుట్టుకనే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తే.. సీఎం జగన్ మహిళా పక్షపాతిగా దేశానికే ఆదర్శమయ్యారని విజయనగరంలో వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఎన్నో పథకాలు ఇచ్చారని ఆమె తెలిపారు. దేశంలో ఏ సీఎం ప్రోత్సహించని రీతిలో మహిళలకు సీఎం వైయస్ జగన్ ప్రోత్సహిస్తున్నారని శ్రీవాణి చెప్పుకొచ్చారు. పథకాలు, పదవుల్లోనూ మహిళలకు సీఎం వైయస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని.. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.
ఇక, వైసీపీ ఎంపీ, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఢిల్లీలో పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ డిమాండ్లను నెరవేర్చే వరకు కేంద్రప్రభుత్వంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు ప్రాజెక్టుల అంశాన్ని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లామని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశామని తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీలు నందిగం సురేష్, గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్, పోచ బ్రహ్మానందరెడ్డిలతో కలిసి మార్గాని భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టిన మార్గాని.. పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాఫర్ డ్యామ్ వద్ద జలాశయంలో నీరు నిలిచిందని, వర్షాకాలంలో ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించకపోతే మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. పోలవరానికి సంబంధించి సవరించిన అంచనాలను ఆమోదించాలని డిమాండ్ చేశారు.