Sajjala : ‘ఏపీలో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మడం లేదు.. ఎందుకంటే..’ : సజ్జల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పదేళ్లపాటు వైయస్ జగన్..
Sajjala Ramakrishna Reddy : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పదేళ్లపాటు వైయస్ జగన్ పక్కన నడిచిన అభిమానులే..నేడు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల అభిమానాన్ని జగన్ నిలుపుకోగలిగారన్నారు. అట్టడుగు వర్గాలను వాళ్ల కాళ్లపై నిలబెట్టడం.. ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే జగన్ లక్ష్యమని సజ్జల చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ..ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చర్చావేదికలు ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
పార్టీ శ్రేణులకు ఉండాల్సిన నాయకత్వ లక్షణాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విజయోత్సవ సభలో వెల్లడించారు. తొలి దశలో 15 వేల స్కూళ్లలో నాడు – నేడు పథకం ద్వారా పనులు చేపడుతున్నారని, కొత్త అభివృద్ధి కావాలంటే దీనిపై నిరంతరం చర్చ జరగాలని ఆయన తెలిపారు. ప్రత్యార్థులు ఈ పథకాలపై ఆలోచన చేయడం లేదు. అప్పులు చేస్తున్నారు..అధికార దుర్వినియోగం అంటున్నారని సజ్జల విమర్శించారు.
“లక్ష 34 వేల ఉద్యోగాలు ఇచ్చారని వారే చెబుతారు. మళ్లీ వాళ్లే ఉద్యోగాలే ఇవ్వడం లేదంటారు. రెగ్యులర్ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ మొన్న విడుదల చేయాల్సిన అవసరం లేదు. కానీ పోటీ పరీక్షలకు ప్రిఫైర్ అవుతున్న విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని క్యాలెండర్ విడుదల చేశాం. ఈ ఏడాది రాలేదన్న నిరాశ ఉన్నా.. వచ్చే ఏడాది సాధిస్తామన్న ఆలోచన వస్తుంది.” అని సజ్జల తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు 34 వేల ఉద్యోగాలు ఇస్తే.. ఏడాదిలోనే 1.34 లక్షల ఉద్యోగాలు, ఆప్కాస్, ఆర్టీసీ ఉద్యోగాలు సీఎం జగన్ ఇచ్చారని సజ్జల చెప్పుకొచ్చారు.
Read also: Mekapati Goutham Reddy : ఏపీలో ఐటీ ఉద్యోగాలపై సంచలన ప్రకటన చేసిన మంత్రి మేకపాటి